లైంగిక వేధింపుల కేసు: కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్
x
కాంగ్రెస్ బహిషృత ఎమ్మెల్యే రాహుల్

లైంగిక వేధింపుల కేసు: కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్

ముగ్గురు మహిళలపై లైంగిక దాడి, బలవంతపు గర్భస్రావాలు చేయించినట్లు ఆరోపణలు


మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కాంగ్రెస్ బహిషృత ఎమ్మెల్యే రాహుల్ మమ్ కూటథిల్ ను క్రైమ్ బ్యాంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్ట్ చేసింది. పాలక్కాడ్ లో హోటల్ గదిలో ఉన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటికే ఈ ఎమ్మెల్యేపై రెండు లైంగిక వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నిన్న మూడో ఫిర్యాదు ఓ ఎన్ ఆర్ఐ చేశారు. క్రైమ్ బ్రాంచ్ కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆమె సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు. దీని ఆధారంగా సిట్ రాహుల్ ను అదుపులోకి తీసుకుంది.

కొత్త లైంగిక వేధింపులు..
మూడో ఫిర్యాదు ప్రకారం.. రాహుల్ తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ఆమెతో సంబంధం ప్రారంభం అయింది. బాధిత మహిళ సెలవుల్లో పాలక్కాడ్ లోని ఒక హోటల్ లో తనను కలిశాడు. అక్కడ తనపై లైంగిక వేధింపులు చేశారు.
తనను గర్భవతిని చేయాలని కోరుకున్నాడని, తన నుంచి డబ్బులు తీసుకున్నాడని పేర్కొంది. తనకు విడాకులు మంజూరు అయిన తరువాత వివాహం చేసుకుంటాడని నమ్మించాడని ఆరోపించింది.
కానీ గర్భం దాల్చాక తన మొహం కూడా చూడలేదని, తనవద్ద బిడ్డకు సంబంధించిన శాంపిల్ ఉందని తెలిపింది. తను స్వయంగా దర్యాప్తు అధికారులను కలిసి వాంగ్మూలం ఇస్తానని పేర్కొంది.
పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా, భౌతికంగా దాడులకు పాల్పడినట్లు చెప్పారు. ఇంతకుముందు పెట్టిన కేసులు కల్పితమని ఆయన వివరణ ఇవ్వగా, ఇప్పుడు ఇవన్నీ నిజమని ఆమె పేర్కొంది.
దర్యాప్తు అధికారులు ఈ ఫిర్యాదుకు సంబంధించిన కమ్యూనికేషన్ రికార్డులు, ప్రయాణ వివరాలు, వైద్య పత్రాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించి కుటుంబ పరిస్థితులను తనకు అనుకూలంగా రాహుల్ వాడుకున్నాడని ఆరోపణలు ఉన్నాయని పోలీస్ వర్గాలు ఫెడరల్ కు తెలిపాయి.
న్యాయపోరాటం..
ఎమ్మెల్యేపై వరుసగా లైంగిక వేధింపుల కేసులు నమోదు అవుతున్నాయి. గత సంవత్సరం తొలి కేసు నమోదు అయింది. టీవీ జర్నలిస్ట్ అయిన తనపై అత్యాచారం చేయడంతో గర్భవతి అయ్యానని, తనపై బలవంతంగా గర్భస్రావం చేయించుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో రాహుల్ అరెస్ట్ ను కేరళ హైకోర్టు జనవరి 21 వరకు నిలిపివేసింది.
రెండో కేసులో కేరళకు చెందని మరో మహిళ ఇదే విధంగా అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ కేసులో అతనికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు అధికారులు మూడు ఫిర్యాదులపై ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు.
మొదటి ఫిర్యాదుదారుడి భావోద్వేగ పోస్ట్..
రాహుల్ ను అరెస్ట్ చేయడంపై మొదటి బాధితురాలు భావోద్వేగ పోస్ట్ చేశారు. తాను అనుభవించిన బాధ, ద్రోహం ఉన్నప్పటికీ తనకు ధైర్యంగా మాట్లాడానికి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుతూ పోస్ట్ లో పేర్కొంది.
రహస్యంగా జరిగింది, ప్రపంచానికి తెలిసిందని పేర్కొంది. ఈ బాధితురాలిపై అనేకసార్లు లైంగిక దాడి జరిగిందని, గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించిన మొదటి వ్యక్తి.
Read More
Next Story