‘అవి ప్రధాని ఇంటికి వెళ్లే దార్లోనూ ఉన్నాయి..’
x

‘అవి ప్రధాని ఇంటికి వెళ్లే దార్లోనూ ఉన్నాయి..’

కర్ణాటకలో గుంతలు తేలిన రహదారులపై బీజేపీకి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్ట్రాంగ్ కౌంటర్..


Click the Play button to hear this message in audio format

‘‘గుంతలు తేలిన రోడ్లు కర్ణాటక(Karnataka)లో మాత్రమే కనిపించవు. దేశ రాజధానిలోనూ ఉన్నాయి. ప్రధాని మోదీ నివాసానికి వెళ్లే దార్లోనూ గుంతలున్నాయి? ఢిల్లీలోని మీ విలేఖరులను అడగండి.’’ - ఇవి కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shiva Kumar) వ్యాఖ్యలు.

బెంగళూరులో రోడ్ల దుస్థితిపై కర్ణాటక భారతీయ జనతా పార్టీ (BJP) రోడ్డు దిగ్బంధనానికి పిలుపునిచ్చింది. 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో డీకే కాషాయ పార్టీ నాయకులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో మాత్రమే రోడ్లపై గుంతలున్నాయని మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై అనవసర రాద్దాంతం చేసి ప్రతిపక్ష బీజేపీ లాభపడాలని చూస్తోందని డీకే ఆరోపించారు.

బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ (ORR)లోని బెల్లాండూర్ వద్ద ఉన్న ఆన్‌లైన్ ట్రక్కింగ్ ప్లాట్‌ఫామ్ బ్లాక్‌బక్ మరో చోటికి తరలించాలనుకుంటున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తూ.. బెంగళూరులోని ఇన్ఫోసిస్ మాజీ CFO మోహన్‌దాస్ పాయ్, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా రోడ్ల దుస్థితిపై జోక్యం చేసుకోవాలని ఇటీవల సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కోరారు.

‘మా పని మేం చేస్తున్నాం..’

"వర్షం కురుస్తున్నా.. మున్సిపల్ సిబ్బంది తమ పని తాము చేస్తున్నారు. గుంతలను పూడ్చుతున్నాము. ప్రతి కార్పొరేషన్‌లో (బెంగళూరులోని 5 కార్పొరేషన్లు) దాదాపు వెయ్యి గుంతలను రోజూ పూడుస్తున్నారు.’’ అని చెప్పారు బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కూడా అయిన డీకే.

రేపు (సెప్టెంబర్ 24) బీహార్(Bihar) రాజధాని పాట్నా(Patna)లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం గురించి మాట్లాడుతూ..సీఎం సిద్ధరామయ్యతో కలిసి వెళ్తున్నా. ముఖ్యమంత్రి ఈరోజు సాయంత్రం బయలుదేరుతారు.’’ అని చెప్పారు శివకుమార్.

Read More
Next Story