‘అంతర్గత విభేదాలతో జనం సమస్యలు గాలికొదిలేశారు’
కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని ఆరోపించారు.
కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం సీఎం, డిప్యూటీ సీఎం మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని ఆరోపించారు. కుర్చీ కోసం పాకులాడుతూ.. జనం ఇబ్బందులను గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయని, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు.
డెంగ్యూతో పాటు కర్ణాటకలో జికా వైరస్ కేసుల గురించి వార్తలు వస్తున్నాయని, ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉందన్న బెంగళూరు నార్త్ ఎంపీ.. డెంగ్యూ పరీక్షలకు ప్రభుత్వం రేటు నిర్ణయించినా ఎవరూ పాటించడం లేదన్నారు. బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSS) సమర్థవంతంగా పనిచేయడం లేదన్నారు.
బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు, ఇంజనీర్లు నగరంలోని ఏ వార్డును సందర్శించడం లేదని ఆరోపించారు.
Next Story