‘నో ఛేంజ్.. అవన్నీ పుకార్లే’
x

‘నో ఛేంజ్.. అవన్నీ పుకార్లే’

ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను తోసిపుచ్చిన కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య..


Click the Play button to hear this message in audio format

కర్ణాటక(Karnataka)లో పవర్ షేరింగ్ పాలిటిక్స్‌పై గత కొంతకాలంగా విస్త్రత చర్చ జరుగుతోంది. సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah)ను మార్చేసి ఆయన స్థానాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌(DK Shiva Kumar)తో భర్తీ చేస్తారని పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట. కొన్ని రోజులుగా ఈ పుకార్లు మరీ ఎక్కువకావడంతో సిద్ధరామయ్య జోక్యం చేసుకున్నారు. ముఖ్యమంత్రిని మార్చడంపై ఎలాంటి చర్చ జరగడం లేదని క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సిద్ధరామయ్య.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో '50-50 ఫార్ములా' లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని డీకే శివకుమారే ఇటీవల స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

'50-50 ఫార్ములా లేదు'

"50-50 ఫార్ములా లేదు. ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని డీకే శివకుమారే స్వయంగా చెప్పారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి మేమంతా కట్టుబడి ఉంటాం," అని చెప్పారు సిద్ధరామయ్య.

రాహుల్‌తో అపాయింట్మెంట్..

లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరానని, అయితే అక్కడి నుంచి సమాచారం రావాల్సి ఉందని సిద్ధరామయ్య చెప్పారు.

క్లారిటీ ఇచ్చిన ఏఐసీసీ చీఫ్..

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Kharge) ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. సీఎంను మార్చడం, మార్చకపోవడం హైకమాండ్ చూసుకుంటుందని, ఎమ్మెల్యేలు ఇక ఆ విషయంపై మాట్లాడొద్దని ఆయన సూచించారు.

అహిందానే అసలు కారణమా?

సీఎం సిద్ధరామయ్య బలం..అహిందా గ్రూపుల్లో ఆయనకున్న భారీ మద్దతే. కర్ణాటకలో మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులు..ఈ మూడు వర్గాలు కాంగ్రెస్‌కు అతిపెద్ద ఓటు బ్యాంకు. ఈ గ్రూపులు కూడా సిద్ధరామయ్యపై ఎంతో నమ్మకంగా ఉన్నాయి. గట్టి మద్దతు ఇస్తూనే ఉన్నాయి. సిద్ధరామయ్యను పక్కకపెడితే ఈ వర్గాల అసంతృప్తికి గురికావాల్సి వస్తుందని, వారి ఓటు బ్యాంకు కోల్పోయి, పార్టీకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.

ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీల మద్దతు కూడగట్టే బాధ్యతను AICC సిద్ధరామయ్యకు అప్పగించింది. ఈ మేరకు దేశంలోని 24 మంది సీనియర్ నాయకులతో OBC సలహా మండలిని పార్టీ ఏర్పాటు చేయబోతోంది. సిద్ధరామయ్య అధ్యక్షతన తొలి సమావేశాన్ని కర్ణాటకలో నిర్వహించనున్నారు. సిద్ధరామయ్యపై నమ్మకంగా ఉన్న పార్టీ అధిష్టానం.. ఆయనను పార్టీ సోషల్ జస్టిస్ మిషన్‌కు ప్రతినిధిగా చూయించాలనుకుంటోంది.

Read More
Next Story