‘వీర వనిత రాణి చెన్నమ్మ’
x

‘వీర వనిత రాణి చెన్నమ్మ’

ఆమె సమాధిని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని ప్రధాని మోదీకి లేఖ రాసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..


Click the Play button to hear this message in audio format

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కిట్టూర్ రాణి చెన్నమ్మ(Rani Chennamma) సమాధిని జాతీయ స్మారక చిహ్నాంగా ప్రకటించాలని కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించారు. ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించిన మహిళలలో రాణి చెన్నమ్మకు ప్రత్యేక స్థానం ఉందని, ఆమె ధైర్యసాహసాలు, అసమాన ప్రతిభ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

వీరవనిత చెన్నమ్మ..

ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జ‌రిగిన పోరాటంలో ప్రాణాలర్పించిన వీర‌వ‌నిత కిత్తూరు మ‌హారాణి చెన్నమ్మ. 1778లో ఉత్తర కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని కాకతి గ్రామంలో లింగాయత్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించారు. చెన్నమ్మకు దేశాయ్ యువరాజు మల్ల సర్జాతో వివాహం జరిగింది. భర్త అకాల మరణంతో.. చెన్నమ్మ తన దత్తపుత్రుడు శివలింగప్పకు ఆయన బాధ్యతలు అప్పగించాలనుకున్నారు. అయితే రాజుకు వారసులు లేరని ఈస్ట్ ఇండియన్ కంపెనీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చింది. అయితే రాణి చెన్నమ్మ ఆంగ్లేయుల‌కు వ్యతిరేకంగా పోరాడారు. 1824లో ఈస్టిండియా కంపెనీ సైన్యానికి, రాణి చెన్నమ్మ సైన్యానికి మ‌ధ్య భీక‌ర పోరు జ‌రిగింది. రాణి చెన్నమ్మ సైన్యంలో కీలకంగా వ్యవహరించిన బాలప్ప కంపెనీ సైన్యాధిపతి సర్ జాన్ థాకరేను కాల్చి చంపాడు. ఇద్దరు బ్రిటీష్ అధికారులను కూడా బంధించారు. ఆంగ్లేయులు వెనక్కు తగ్గారు. చేసేదేమీ లేక కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో చెన్నమ్మ ఇద్దరు బ్రిటీష్ అధికారులను విడుదల చేయించారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ నమ్మకద్రోహానికి పాల్పడింది. కిత్తూరుపై దాడికి మళ్లీ బలగాలను పంపింది. భీకర యుద్ధం జరిగింది. చివరకు రాణి చెన్నమ్మ బందీగా దొరికారు. రాణి సేనాధిపతి సంగొల్లి రాయన్నను ఉరి తీశారు. రాణి చెన్నమ్మను బైల్‌హోంకెల్ కోటలో ఉంచారు. ఆమె అక్కడే తుది శ్వాస విడిచారు. చెన్నమ్మ దత్తపుత్రుడిని కూడా జైలులో బంధించారు.


Read More
Next Story