
సీఎం సిద్ధరామయ్య
సీఎం మార్పుపై మరోసారి స్పందించిన సిద్ధరామయ్య
అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న కర్ణాటక ముఖ్యమంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని సీఎం సిద్ధరామయ్య మరోసారి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, మిగిలిన కాంగ్రెస్ నాయకులు సైతం ఇదే బాటలో నడుస్తారని ఆయన చెప్పారు.
తాను ఇప్పటికే హైకమాండ్ తో మాట్లాడానని, ఈ విషయం పూర్తి స్థాయిలో నిర్ణయించబడుతుందని వారు తనకు ఇప్పటికే చెప్పినట్లు పేర్కొన్నారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం గత కొంతకాలంగా గందరగోళంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ గందరగోళం కేవలం స్థానిక స్థాయిలో మాత్రమే ఉందని, పార్టీ కేంద్ర నాయకత్వంలో లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన ఒకరోజు తరువాత ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. హై కమాండ్ ను నిందించడం కంటే స్థానిక నాయకులు అంతర్గత వివాదాలకు బాధ్యత వహించాలని కూడా ఆయన అన్నారు.
నిర్ణయం పెండింగ్ లో ఉంది
మైసూర్ లో సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను హైకమాండ్ తో మాట్లాడాను. వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. హైకమాండ్ ఏది నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను’’ అని అన్నారు.
నవంబర్ 20న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం మార్క్ ను చేరుకున్న తరువాత రాష్ట్రంలో నాయకుడి మార్పు ఉంటుందని ఊహాగానాలు చెలరేగాయి. నాయకత్వ అంశంపై స్పష్టత ఎప్పుడూ వస్తుందని అడిగిన ప్రశ్నకు హైకమాండ్ ఎప్పుడూ నిర్ణయం తీసుకుంటుందో అని ముఖ్యమంత్రి అన్నారు.
ఐదేళ్ల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉంటారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అది వేరే విషయం. హైకమాండ్ ఏదీ నిర్ణయిస్తే అది’’ అన్నారు. హైకమాండ్ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని అందరూ కట్టుబడి ఉంటారనే నాకు నమ్మకం ఉందని అన్నారు.
‘‘ఈ విషయంపై ఇన్ని ప్రశ్నలు అడగడానికి ఏముంది? అసెంబ్లీలో నేను చెప్పాల్సినవన్నీ చెప్పిన తరువాత ఇంకా దీని గురించి ఎందుకు చర్చించాలి’’ అని ఆయన అన్నారు.
శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని అసెంబ్లీలో ప్రకటించారు. కాంగ్రెస్ హై కమాండ్ నాకు అనుకూలంగా ఉందని, తాను రెండున్నర సంవత్సరాలు మాత్రమే పదవిలో కొనసాగాలా వద్దా అనే నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.
పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదు..
సిద్ధరామయ్య వ్యాఖ్యలపై డీకే శివకుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రమేయంతో తాను, సీఎం సిద్ధరామయ్య ఒక ఒప్పందానికి వచ్చామని దానికి తాము కట్టుబడి ఉంటామని అన్నారు.
సంక్రాంతి తరువాత రాజకీయ విప్లవం గురించి రాజకీయ వర్గాల్లో వస్తున్న వాదనల గురించి ప్రస్తావించినప్పుడూ సిద్ధరామయ్య సోమవారం మాట్లాడుతూ.. చివరికి హై కమాండ్ నిర్ణయం తీసుకోవాలి.
‘‘అంతా అయిపోయింది. నేను ఒక్కసారి చెబుతున్నాను. చివరికి హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. హైకమాండ్ ఏది నిర్ణయించినా అందరూ దానికి కట్టుబడి ఉంటారు.
పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదని, ఏ ఒక్క వ్యక్తి వల్ల పార్టీ అధికారంలోని రాలేదని ఖర్గే చేసిన ప్రకటనను మరోసారి ధృవీకరించారు’’ పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాలేరని అన్నారు.
సీనియర్ ఎమ్మెల్యే, తన సన్నిహితుడు కే. ఎన్. రాజన్న శివకుమార్ తో జరిగిన సమావేశంపై ముఖ్యమంత్రి స్పందించారు. ‘‘అతను కలవనివ్వండి. శివకుమార్ పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడు. అందులో తప్పేముంది?’’ అని అన్నారు. ఎస్.ఎం కృష్ణ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ(1999-2004) సమయంలో రాజన్న అపెక్స్ బ్యాంక్ చైర్మన్ గా చేశాడు.
Next Story

