కర్ణాటక ప్రభుత్వం ముందు లొంగిపోయిన ఆరుగురు నక్సలైట్లు
x

కర్ణాటక ప్రభుత్వం ముందు లొంగిపోయిన ఆరుగురు నక్సలైట్లు

నలుగురు ఆదివాసీ మహిళలు, ఇద్దరు పురుషులు.. ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ కూడా..


కర్నాటక ప్రభుత్వం ముందు ఆరుగురు నక్సలైట్లు లొంగిపోయారు. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారు. వీరంతా చాలా సంవత్సరాల పాటు రహస్యంగా కర్ణాటక తో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కార్యకలాపాల కోసం పని చేసినట్లు ఒప్పుకున్నారు.

చిక్కమగళూర్ డిస్ట్రిక్ కమిషనర్ ఆఫీస్ లో ఈ లొంగబాటు ప్రక్రియ జరిగింది. లొంగిపోయిన మహిళల్లో ముగ్గురు పేదరికం వేధింపుల కారణంతో సాయుధ పోరాటం వైపు మొగ్గు చూపారు. వారు నివసిస్తున్న గ్రామంలో స్వార్థ శక్తులకు వ్యతిరేకంగా పోరాటానికి నక్సలైట్లుగా మారినట్లు తెలిపారు.

ముందగారు లత..
లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరైన మందగారు లత కర్నాటకలోని కొప్ప తాలుకాలోని బుక్కడిబెయిల్ ప్రాంతానికి చెందింది. ఆమెకు లోకమ్మ అలియాస్ శ్యామల అనే పేర్లు సైతం ఉన్నాయి. ఆమె 2000 సంవత్సరంలో అంటే తనకు 18 ఏళ్ల వయస్సులో ఉండగా నక్సలిజంలో చేరారు. ఈ గిరిజన మహిళ కేవలం 6వ తరగతితో తన చదువు ఆపేసింది. పేదరికం, వేధింపులతో పాటు కుద్రేముఖ్ నేషనల్ ప్రాజెక్ట్ కారణంగా తమ ప్రాంతాలను విడిచిపెట్టాల్సి వచ్చింది.
రెండో గిరజన మహిళ..
మరో మహిళ మావోయిస్టు బెళ్తాంగడి తాలుకాలోని కట్లూర్ ప్రాంతానికి చెందినది. పేదరికం కారణంగా 3 వ తరగతితో చదువు ఆపేసింది. తన కుటుంబం కూడా కుద్రేముఖ్ నేషనల్ పార్క్ సందర్భంగా ప్రాంతం విడిచిపెట్టి పోవాలనే భయాందోళనలకు గురైంది. తరువాత మావోయిస్టులలతో చేతులు కలిపింది. తన కమ్యూనిటీని పోలీసులు వేధించడం కూడా మావోలతో చేతులు కలపడానికి కారణంగా పేర్కొంది.
ఎక్స్ గ్రామ పంచాయతీ మెంబర్..
మూడో నక్సలైట్ వనజాక్షి బలేహోలే.. ఈమేది బలేహోలే గ్రామం.. ఇది కలాసా తాలుకా, చిక్కమగళూర్ లో ఉంది. వనజాక్షి 10 వ తరగతి పూర్తి చేసింది. 1992 నుంచి 1997 వరకూ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసింది. అయితే కొంతమంది రాజకీయ నాయకులు తన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో వారి నుంచి తన కమ్యూనిటీకి కూడా వేధింపులు పెరగడం, వ్యవస్థ నుంచి సరైన సపోర్టు రాకపోవడంతో సాయుధ పోరాటం వైపు మొగ్గు చూపారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్..
ఈ గ్రూపులో తమిళనాడులోని ఆర్కాట్ ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ వసంత్ కూడా ఉన్నాడు. సామాజిక సమస్యలు చూసి తను కూడా నక్సలైట్ల ఉద్యమంలో చేరాడు. 2010 లో బీటేక్ పూర్తికాగానే మావోలతో చేరి కర్నాటక, కేరళలో తన కార్యకలాపాలు నిర్వహించాడు.
అలాగే జయన్న అనే మరో వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. దళితుడైన ఈయన బీఏ డిగ్రీ పూర్తి చేశాడు. రాయచూర్ ప్రాంతంలోని మాన్వి తాలుకాకు చెందిన వాడు. పేదలపై జరుగుతున్న అన్యాయాలను చూసి నక్సలైట్ గా మారాలని అనుకున్నాడు.
2000 సంవత్సరంలో పార్టీలో చేరానని, అప్పుడు తన వయస్సు 24 అని తెలిపాడు. కేరళ- కర్ణాటక ప్రాంతంలో తన కార్యకలాపాలను నిర్వహించాడు. తనకు ప్రభుత్వం పునరావాసం కింద ఇచ్చే డబ్బుతో తన గ్రామంలోని పాఠశాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు.
కేరళ నక్సలైట్
కేరళకు చెందిన జీఎన్ జైషా.. ఈమె కూడా ఆదివాసీ. వాయనాడ్ లోని మక్కిమాల గ్రామం. కేవలం 8 తరగతి వరకే చదువుకుంది. 2018లో మావోలతో చేతులు కలిపింది. 2023 లో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. తరువాత కోస్టల్ ఏరియాకు చేరింది.
దీనిపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రాన్ని నక్సలైట్ రహితంగా మార్చడానికి లొంగుబాటు ప్రక్రియను ప్రొత్సహిస్తున్నామని పేర్కొంది.
లొంగుబాటు ప్రక్రియ..
రాష్ట్రంలో నక్సలైట్లు లొంగుబాటు,పునరావాస కమిటీ సభ్యులైన డాక్టర్ బనజాగిరే జయప్రకాశ్, లాయర్ కేపీ శ్రీపాల్, జర్నలిస్ట్ పార్వతీష్ బిలిడాలే ముందు జరిగింది.
ఈ లొంగుబాటు ముందు వారి ఉన్న కేసులు, పునరావాసం, ప్యాకేజీలు, పౌర హక్కుల్లో పాల్గొనడం వంటి చర్చలు జరిగాయి. ప్రభుత్వం దీనికి సమ్మతించిన తరువాతనే నక్సలైట్లు లొంగిపోయారు.
ఈ లొంగుబాటు పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం స్పందించారు. నక్సలైట్లు సమాజంలో భాగస్వాములు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కమిట్ మెంట్ తో ఉందని అన్నారు.
సివిల్ సొసైటీ..
కర్ణాటక ప్రభుత్వం ప్రజా సంఘాలతో కలిసి లొంగుబాటు ప్రక్రియను సులభతరంచేసిందని అంటున్నారు. అలాగే అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులను వేధించడం మానుకుందని, ల్యాండ్ కమిటీలు ఏర్పాటు చేయడం, దళితుల అభివృద్దికి చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ ప్రక్రియ మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ బీజం వేశారని హోంమంత్రి జీ పరమేశ్వర అన్నారు.
Read More
Next Story