‘‘భారత్ కేవలం హిందువులదే అనే నినాదాలు తప్పు‘‘
x
మార్తోమా మాథ్యూస్-III

‘‘భారత్ కేవలం హిందువులదే అనే నినాదాలు తప్పు‘‘

కాథలిక్ చర్చ్ ఫాదర్ మాథ్యూస్-3, ఆర్ఎస్ఎస్ పై విమర్శలు


‘ఇండియా ఓన్లీ ఫర్ హిందూస్’ అనే నినాదాలు సరికాదని, దేశంలోని క్రైస్తవులు, ముస్లింలు బయటి వ్యక్తులు కారని తూర్పు కాథలిక్, మలంకర మెట్రోపాలిటన్ బెసెలియోస్ మార్తోమా మాథ్యూస్-III అన్నారు.

మతపరమైన దాడులను ఆయన తీవ్రంగా విమర్శించారు. అధికారుల మౌనం వల్లే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని, వారు వాటిని చట్టబద్దం చేస్తున్నారని ఆక్షేపించారు.

కేరళలోని పనయంపాలలోని సెయింట్ మేరీ చర్చిలో జరిగిన విందు సందర్భంగా మలంకర ఆర్థోడాక్స్ సిరియన్ చర్చి అత్యున్నత అధిపతి అయిన మార్తుమ్ మాట్లాడారు. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకునే దాడి చేసే సంఘటనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని, వీటిపై తక్షణ దృష్టి అవసరమని అన్నారు.

దాడుల వెనక ఆర్ఎస్ఎస్ ఉంది..
ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ.. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలైన బజరంగ్ దళ్, వీహెచ్పీ వంటివి క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
క్రిస్మస్ సీజన్ లో జరిగిన సంఘటనలను ఆయన ప్రస్తావించారు. క్రైస్తవ సన్యాసినుల, తరువాత ఫాదర్ లపై కూడా దాడులు జరుగుతున్నాయని అన్నారు.
‘‘చర్చిల వెనక క్రిస్మస్ వేడుకలను నాశనం చేసిన తరువాత, వారు చర్చిలోకి ప్రవేశించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు’’ అని హెచ్చరించారు.
పాలకుల మౌనం.. ఆమోదంతో సమానం..
రాజ్యాంగ హమీలను ఆయన గుర్తు చేస్తూ.. ప్రతి మతం సత్యం, న్యాయం, ప్రేమను ప్రభోదిస్తున్నాయని, కానీ అన్ని సమాజాలు మత ఛాందసవాదులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని కాథలిక్ గురువు అన్నారు.
‘‘మతం లేదా సమాజంతో సంబంధం లేకుండా అటువంటి తీవ్రవాదులను నియంత్రించడం దేశాన్ని పరిపాలించే వారి బాధ్యత’’అని ఆయన అన్నారు. రాజ్యాంగం అందరూ పౌరులకు విశ్వాసం, ఆరాధన, ప్రచారం, స్వేచ్ఛకు హమీ ఇచ్చారని అన్నారు. పాలకులు మౌనంగా ఉన్నప్పుడూ లేదా ఈ చర్యలను ఖండించనప్పుడూ అది ఆమోదంతో సమానం’’ అని ఆయన అన్నారు.
ఇటీవల కాలంలో దేశంలో విదేశీ మతాలకు వ్యతిరేకంగా వినిపిస్తున్న నినాదాలకు సంబంధించి ‘‘ఇటువంటివి భారత దేశ చరిత్ర పట్ల వారి అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయి’’ అని ఆయన అననారు. దేశంలోకి వలసలు వేల సంవత్సరాలుగా భారత్ ను తీర్చిదిద్దాయని, మతపరమైన స్వేచ్ఛ ప్రత్యేకతను తీసుకొచ్చాయని అన్నారు.
‘‘క్రైస్తవులు భారత్ లో క్రీ.శ. 52(సామాన్య శకం) నుంచి ఉన్నారు. వారు ముస్లింలు, హిందువుల మాదిరిగానే ఇక్కడ పుట్టి పెరిగారు’’ అని ఆయన చెప్పారు. ఏ భారతీయ క్రైస్తవుడు, ముస్లింలు బయటి వ్యక్తి కాదని అన్నారు.
భారత్ కేవలం హిందువుల కోసమే వంటి నినాదాలకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ అటువంటి ఆలోచనలు రాజ్యాంగం, దేశ స్వభావానికి విరుద్దంగా ఉన్నాయని ఆయన అన్నారు.
క్రైస్తవులే కాకుండా ఏదైన మైనారిటీ సమాజంపై దాడులు జరిగినప్పుడూ తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి మైనారిటీలకు చరిత్ర, రాజ్యాంగ హక్కులను గురించి తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు.
Read More
Next Story