అది ‘క్షమాపణ లేక బెదిరింపా?’
x

అది ‘క్షమాపణ లేక బెదిరింపా?’

హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌లో గడువు తీరిన పదార్థాలను వంటకాల తయారీకి వాడుతున్నట్టు ఫుడ్ సెఫ్టీ అధికారులు గుర్తించారు.


‘రామేశ్వరం కేఫ్’ పేరు తెలియని వారుండరు. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని ఈ కేఫ్‌లో ఇటీవల పేలుడు సంభవించడంతో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ కేఫ్‌కు అనుసంధానంగా హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్ ఉంది. దీనిపై ఈ మధ్యనే తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు దాడి చేశారు. గడువు ముగిసిన ఇంగ్రీడియంట్స్‌ వంటకాల్లో వాడుతున్నారని గుర్తించారు.

క్షమాపణ వీడియోపై ట్రోల్స్..

ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత కేఫ్ వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు క్షమాపణ కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో “మేం నాణ్యతలో రాజీపడం. ఆహారపదార్ధాల తయారీకి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడతాం. సాధారణంగా తప్పు జరగదు. జరిగిన దానికి క్షమాపణ కోరుతున్నా. ఇకముందు అలా జరగడానికి వీల్లేదని మా వాళ్లకు చెప్పా." అని మాట్లాడారు.

క్షమాపణ కోరడం బాగానే ఉన్నా..ఆయన బాడీ లాంగ్వేజ్‌పైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1.16 నిమిషాల వీడియోలో ఆయన కెమెరా వైపు వేలు చూపుతూ.. భయపెట్టే విధంగా మాట్లాడడంపై కామెంట్లు మొదలయ్యాయి. ఆయన క్షమాపణ చెప్పినట్టు లేదని.. హెచ్చరిస్తున్నట్టు ఉందని ఒకరు ట్రోల్ చేశారు. “అతను క్షమాపణలు చెబుతున్నాడా లేక బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడా? అని మరొకరు పోస్టు చేశారు.

ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడుల తరువాత రాఘవేంద్ర రావు భార్య, కంపెనీ సహ వ్యవస్థాపకురాలు దివ్య రాఘవేంద్రరావు ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టుబడినవి వాడేందుకు కాదని పేర్కొన్నారు.

రామేశ్వరం కేఫ్ ప్రత్యేకతేంటి?

రాఘవేంద్రరావు, దివ్య దంపతులు 2021లో బెంగళూరులోని ఇందిరానగర్‌లో రామేశ్వరం కేఫ్ ప్రారంభించారు. రాఘవేంద్రరావుకు ఫుడ్ బిజినెస్ లో 15 సంవత్సరాల అనుభవం ఉంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వీరికి దైవంతో సమానం. అందుకే హోటల్‌ పేరు ‘రామేశ్వరం కెఫె’గా నామకరణం చేశారు.

కేవలం ఇడ్లీ, ఉప్మా, పొంగల్‌, పూరీ, మైసూర్‌ బోండా వంటివే ఇక్కడ ఉంటాయి. అయితే వీటి తయారీకి నాణ్యమైన పదార్థాలు వాడతారు. రోజుకి ఏడు వేల మందికిపైగా అల్పాహారం వడ్డిస్తున్న ఈ హోటల్‌ ఆదాయం నెలకి నాలుగున్నర కోట్లపైమాటే.

Read More
Next Story