‘బెంగళూర్ పేలుళ్లు తమిళుల పనే’ అన్న వ్యాఖ్యలపై మండిపడ్డ స్టాలిన్
x

‘బెంగళూర్ పేలుళ్లు తమిళుల పనే’ అన్న వ్యాఖ్యలపై మండిపడ్డ స్టాలిన్

2024 ఎన్నికల వేళ తమిళులు, కన్నడిగుల మధ్య మరోసారి చిచ్చు రేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రామేశ్వరం బాంబు పేలుళ్లకు కారణం తమిళులే అన్న కేంద్రమంత్రి..


"ఇటీవల బెంగళూరులో జరిగిన పేలుడుకు తమిళులే కారణమని" ఆరోపించిన కేంద్ర మంత్రి, బిజెపి నాయకురాలు శోభా కరంద్లాజేపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, మంత్రి మాట్లాడుతూ "తమిళనాడు నుంచి కొంతమంది శిక్షణ పొంది కర్నాటకు వస్తారు. తరువాత బాంబుల అమర్చి వెళ్లిపోతారు" అని రామేశ్వర కెఫే లో జరిగిన బాంబు దాడిని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూర్ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శోభపై ఎన్నికల సంఘం, ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు.

"ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఆమె NIA అధికారి అయి ఉండాలి లేదా #RameshwaramCafeBlast పాల్పడిన నిందితులతో సంబంధం వ్యక్తి అయినా ఉండాలి. బీజేపీ విభజన రాజకీయాలను తమిళులు, కన్నడిగులు ఒకేలా తిరస్కరిస్తారు. ఈ వ్యాఖ్యలు చేసి శాంతి,భద్రతలు, జాతీయ సమైక్యతకు భంగం చేసేందుకు పాల్పడిన కేంద్రమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను" అని ట్వీట్ చేశారు.
విద్వేషపూరిత ప్రసంగాన్ని గమనించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ముఖ్యమంత్రి కోరారు.


Read More
Next Story