
తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
తస్మాక్(Tasmac) కుంభకోణానికి బాధ్యత వహిస్తూ డీఎంకే సర్కారు తప్పకోవాలని అన్నాడీఎంకే(AIADMK), బీజేపీ(BJP) వాకౌట్.
తమిళనాడు(Tamil nadu) శాసనసభలో 2025-26 ఆర్థికసంవత్సరానికి బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు(Thangam Thennarasu) ఈరోజు (మార్చి 14) ప్రవేశపెడుతున్నారు. మే 2023లో కేబినెట్‌లో మార్పుల అనంతరం ఆర్థిక మంత్రిగా తెన్నరసు బాధ్యతలు స్వీకరించారు. తొలి బడ్జెట్‌ను ఆయన గతేడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టగా.. ఇది ఆయన రెండో బడ్జెట్.
ఈసారి బడ్జెట్ (Budget)ప్రసంగంలో సామాజిక రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇతర రంగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
రెండు భాషల విధానం(Two language policy), నియోజకవర్గ పునర్విభజన అంశాలపై డీఎంకే ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే, ఎన్నికల్లో ఆ పార్టీకి ఇవే ప్రధాన అంశాలు కూడా కావచ్చు.
మార్చి 15న వ్యవసాయ మంత్రి ఎం.ఆర్.కే. పన్నీర్సెల్వం వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. మార్చి 17న అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభమవుతుంది. రాష్ట్ర బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం తమిళ 'రూ' చిహ్నాన్ని విడుదల చేసింది. ఇది అధికారిక రూపాయి చిహ్నానికి బదులుగా రానుండగా, 'ఎల్లాం' (అందరికీ అన్నీ) అనే ట్యాగ్‌లైన్‌తో ప్రవేశపెట్టారు.
విపక్షాల వాకౌట్..
ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అన్నాడీఎంకే, బీజేపీ, రాష్ట్రంలో పాలన అధ్వానంగా తయారైందని, అప్పులు విమర్శించాయి. ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టబడుతున్నారు. తస్మాక్ కుంభకోణంలో రూ. 1,000 కోట్లు అవినీతి జరిగిందని, అందుకు బాధ్యత వహిస్తూ డీఎంకే ప్రభుత్వం రాజీనామా కోరుతూ బడ్జెట్ సమావేశం నుంచి అన్నాడీఎంకే, బీజేపీ వాకౌట్ చేశాయి.
ప్రత్యక్ష ప్రసారం..
ఇదే సమయంలో, చెన్నై మునిసిపల్ కార్పొరేషన్ నగరంలోని 100 ప్రాంతాల్లో బడ్జెట్ ప్రసారాన్నివీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ జాబితాలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్, కోయంబేడు బస్ టర్మినస్, మరీనా బీచ్, పొండీ బజార్ రోడ్, తిరువాన్మియూర్ బీచ్ ఉన్నాయి.