
సుప్రీంకోర్టు
ఇసుక తవ్వకాల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు నిలిపివేసిన సుప్రీం
ఐదువేల కోట్ల కుంభకోణం పై ఫిబ్రవరిలో విచారణకు ఆదేశించిన మద్రాస్ హైకోర్టు
(మహాలింగం పొన్నుస్వామి)
తమిళనాడులో జరిగిన రూ. 5,832 కోట్ల బీచ్ ఇసుక తవ్వకాల కుంభకోణంపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును సుప్రీంకోర్టు నిలిపివేసింది. మోనజైట్ వంటి అరుదైన ఖనిజాలను అక్రమంగా తవ్వుతున్నారని ప్రయివేట్ సంస్థలు, రాజకీయా నాయకులు, అధికారుల మధ్య సంబంధాలు ఉన్నాయని కుంభకోణంలో ఆరోపణలు ఉన్నాయి.
నోటీసులు జారీ..
ఏప్రిల్ 28 న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు వీవీ మినరల్స్ కు, కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తు పై స్టే విధించి, ప్రతివాదులకు సైతం నోటీసులు జారీ చేసింది.
ఫిబ్రవరి 17 నాటి మద్రాస్ హైకోర్టు ఈ కేసును విచారించి సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. అయితే ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వారికి తాత్కాలిక ఉపశమనం లభించింది.
హైకోర్టు తీర్పుకు ముందు ఉన్న యధాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీబీఐ దాడులు, దర్యాప్తు..
సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ్ అగర్వాల్, ముకుల్ రోహత్గీ, ధ్రువ్ మెహతా వీవీ మినరల్ తరఫున కేసు వాదించారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ డబ్ల్యూపీ నంబర్ 14048/2024, 14052/2024, 14055/2024, 14058/2024 లలో అనేక స్పెషల్ లీవ్ పిటిషన్లను దాఖలు చేసిన తరువాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.
ఈ కుంభకోణం 2000 నుంచి 2017 వరకూ జరిగిందని రూ. 3,5811 కోట్ల విలువైన ఖనిజాలను అక్రమంగా తవ్వి సొంతం చేసుకున్నారని సదరు కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ కుంభకోణం దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఏప్రిల్ 5, 2025న రాష్ట్రంలోని 12 ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే సుప్రీంకోర్టు ఈ దర్యాప్తును తాజా విచారణతో నిలిపివేసింది.
నేరారోపణ పత్రాల స్వాధీనం చేసుకున్న తరువాత తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారిలోని తీర ప్రాంత జిల్లాల నుంచి గార్నెట్, ఇల్మనైట్ వంటి విలువైన ఇసుక ఖనిజాలను అక్రమంగా తవ్వడం రవాణా చేయడం, ఎగుమతి చేయడం కోసం మైనింగ్ కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగులు చేతులు కలిపి ప్రభుత్వాన్నిమోసం చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదీ అరవింద్ పి దాతార్, ఎన్ ఆర్ ఎలాంగో తరఫున న్యాయవాదీ తమ వాదన వినిపించాలని కోరుతూ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఖనిజ నిల్వల బదిలీపై..
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు తెలియని ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఖనిజ నిల్వలను ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటేడ్ కి బదిలీ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ చర్యను నిలిపివేసింది.
ఏప్రిల్ 8న రాష్ట్ర సహజ వనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కే.ఫణీంద్ర రెడ్డి జారీ చేసిన ఉత్తర్వూలో తిరునల్వేలీ, తూత్తుకుడి, కన్యాకుమారీ జిల్లాల్లోని మైనింగ్ కంపెనీల వద్ద ఉన్న బీచ్ ఇసుక ఖనిజాల మొత్తం నిల్వను, భద్రత, రవాణా ఖర్చుతో సహ తాత్కాలిక ధర వివరాలను పొందిన తరువాత ఐఆర్ఇఎల్(ఇండియా)లిమిటేడ్ కు అప్పగిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
ఖనిజాల ధరను ఆమోదించడానికి ప్రభుత్వం జియాలజీ, మైనింగ్ కమిషనర్, తమిళనాడు మౌలిక సదుపాయాల అభివృద్ది బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
Next Story