సీఐడీకి సూరజ్ లైంగిక వేధింపుల కేసు
x

సీఐడీకి సూరజ్ లైంగిక వేధింపుల కేసు

కర్ణాటక జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేసును కర్ణాటక ప్రభుత్వం సీఐడికి అప్పగించింది.


జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేసును కర్ణాటక ప్రభుత్వం సీఐడికి అప్పగించింది. కేసు విచారణను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించినట్లు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు.

సూరజ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ పార్టీ కార్యకర్త ఆరోపించాడు. హాసన్‌ నియోజకవర్గం గన్నికాడలోని తన ఫామ్‌హౌస్‌లో ఈ పనిని పాల్పడ్డాడని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా.. హోలెనరసిపుర పోలీసులు సూరజ్‌పై IPC సెక్షన్లు 377 (అసహజ నేరాలు), 342 (తప్పుగా నిర్బంధించడం), 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఆరోపణలను తోసిపుచ్చిన సూరజ్ ..

అయితే మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు, కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి మేనల్లుడు సూరజ్ రేవణ్ణ (37) బాధితుడి ఆరోపణలను తోసిపుచ్చారు. తన నుంచి రూ.5 కోట్లు లాగేందుకు తనపై తప్పుడు ఫిర్యాదు చేశాడని ఆరోపించాడు.

ఇదంతా డబ్బు గుంజేందుకే..

సూరజ్ సన్నిహితుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు బాధితుడిపై కేసు నమోదు చేశారు. డబ్బులు గుంజేందుకే లైంగిక వేధింపుల డ్రామా అడుతున్నాడని శివకుమార్ ఆరోపించారు. బాధితుడు సూరజ్‌ను రూ.5 కోట్లు డిమాండ్ చేయగా.. ఆ తర్వాత రూ.2 కోట్లకు దిగినట్లు ఆరోపణన్నాయి.

ఇప్పటికే అన్నప్రజ్వల్‌ అరెస్ట్..

పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఇప్పటికే సూరజ్ సోదరుడు, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలలో కూడా ప్రజ్వల్ పోటీ చేశారు. అయితే ఎన్నికలకు ముందు రోజు తన అశ్లీల వీడియోలు బయటకు రావడంతో ఆయన జర్మనీకి పారిపోయారు. ఈ మధ్యనే తిరిగిరావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

బెయిల్‌పై ప్రజ్వల్ తల్లిదండ్రులు..

ప్రజ్వల్ బాధితురాలిని కిడ్నాప్ చేశాడని ఆయన తండ్రి రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఇదే కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ ఆంటిసిపేటరీ బెయిల్ పొందారు

Read More
Next Story