లాటరల్ ఎంట్రీ వద్దంటున్న తమిళనాడు సీఎం స్టాలిన్..
x

లాటరల్ ఎంట్రీ వద్దంటున్న తమిళనాడు సీఎం స్టాలిన్..

యుపిఎస్‌సి ఐఎఎస్‌లు కాకుండా.. సంబంధిత విభాగాల్లో నైపుణ్యం, అనుభవం ఆధారంగా బయటి వ్యక్తులతో ఉన్నతస్థాయి పోస్టులను భర్తీ చేయడాన్నే లేటరల్‌ ఎంట్రీ అంటారు.


లాటరల్ ఎంట్రీ విధానంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు 45 మంది కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లను నియమించేందుకు ఇటీవలే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రైవేటు రంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో సేవలందిస్తున్న వారిని ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నియామక విధానాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీ అధికారులకు దేశ అత్యున్నత పదవుల్లో అవకాశం దక్కకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. లాటరల్ ఎంట్రీ విధానానికి స్వస్తి పలకాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.

లాటరల్ ఎంట్రీ అంటే..

యుపిఎస్‌సి ద్వారా ఎంపికయిన ఐఎఎస్‌లు కాకుండా.. సంబంధిత విభాగాల్లో నైపుణ్యం, అనుభవం ఆధారంగా బయటి వ్యక్తులతో ఉన్నతస్థాయి పోస్టులను భర్తీ చేయడాన్నే లేటరల్‌ ఎంట్రీ అంటారు. ఈ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వంలోని విభాగాల్లో తమకు నచ్చిన వ్యక్తులను నియమించుకునే అవకాశం ఉంటుందని కొన్ని పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.

'క్రీమీలేయర్‌ రద్దుకు స్టాలిన్ డిమాండ్‌'

"మేము క్రిమీ‌లేయర్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ మేం ఎప్పటినుంచో చేస్తున్నాం" అని ముఖ్యమంత్రి ఎక్స్‌లో పేర్కొన్నారు.

Read More
Next Story