తమిళనాడు: ముఖ్యమంత్రి అల్పాహార పథకం విస్తరణ
x
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

తమిళనాడు: ముఖ్యమంత్రి అల్పాహార పథకం విస్తరణ

20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్న ఎంకే స్టాలిన్


ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి కీలక పథకాలను విస్తరిస్తూ ప్రజల్లో తనపై పాజిటివ్ పెరిగేలా చూసుకుంటున్నారు. తాజాగా ఆయన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’’ విస్తరిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నూతన విస్తరణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, సహాయక ప్రాథమిక పాఠశాలలకు విస్తరిస్తున్నారు.

ఆగష్టు 26 న విస్తరించబోయే ఈ పథకానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొనబోతున్నారని తమిళ నాడు ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘‘జస్టిస్ పార్టీ కాలం నుంచి ద్రవిడ మోడల్ ప్రభుత్వం వరకూ పిల్లల ఆకలి తీర్చడంతో పాటు వారికి విద్యను అందించాము. ఇది కేవలం ఆహరం అందించడం కాదు. రాష్ట్ర, దేశ వృద్దికి పునాది’’ అని ఆయన అన్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రం దేశానికి మార్గదర్శకుడిగా నిలిచిందని, ఇది తమిళనాడు శాశ్వతంగా అభివృద్ది చెందడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి కామరాజ్ మధ్యాహ్నం భోజనం పథకం పాఠశాలలో ప్రారంభించారని, ఇది దేశ వ్యాప్తంగా మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి డీఎంకే కార్యకర్తలకు రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు.
2022 లో ప్రారంభం..
ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ దీనిని పోషణ భోజన పథకంగా అప్ గ్రేడ్ చేశారు. చాలా సంవత్సరాల తరువాత దివంగత ఎం కరుణానిధి నేతృత్వంలో డీఎంకే ప్రభుత్వం విద్యార్థుల భోజనంలో గుడ్డును చేర్చిందని స్టాలిన్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, సహాయక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3.5 లక్షలకు పైగా విద్యార్థులు అల్పాహార పథకం విస్తరణ ద్వారా ప్రయోజనం పొందుతారని తమిళనాడు ప్రభుత్వం ఇంతకుముందు తెలిపింది.
ఈ ప్రధాన కార్యక్రమాన్ని భారత్ లో తొలిసారిగా 2022 సెప్టెంబర్ 15న మధురై లోని ఆదిమూలం కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో స్టాలిన్ విద్యార్థులకు అల్పాహరం వడ్డించి ప్రారంభించారు.
తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ఈ పథకానికి అద్భుతమైన స్పందన వచ్చిన తరువాత ఈ పథకాన్ని ఆగష్టు 25, 2023 దివంగత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి జన్మ స్థలమైన నాగపట్నం జిల్లాలోని తిరుకువలైలో విస్తరించారు.
దీని ద్వారా 30,992 పాఠశాలలకు చెందిన 18.5 లక్షల మంది విద్యార్థుల ప్రయోజనం పొందారు. ఈ పథకం కింద 3,995 ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 2.23 లక్షల మంది విద్యార్థుల ప్రయోజనం కోసం దీనిని జూలై 15, 2024 న మరింత విస్తరించారు.
Read More
Next Story