
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి
డీఎంకే ఆరోపణలను తోసిపుచ్చిన తమిళనాడు గవర్నర్
95 శాతం బిల్లులు మూడు నెలల్లోనే ఆమోదించినట్లు గణాంకాల విడుదల
తమిళనాడు గవర్నర్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదని డీఎంకే, దాని మిత్రపక్షాలు చేసిన వాదనలను తోసిపుచ్చారు. రాజ్ భవన్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులలో 95 శాతం రాజ్యాంగ గడువులోగా పూర్తి చేశారని తెలిపుతూ అధికారిక డేటాను విడుదల చేసింది.
అవి తప్పుడు ప్రచారాలు..
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఆమోదాన్ని తెలపకుండా జాప్యం చేస్తున్నారని వాదనలను ఖండిస్తూ రాజ్ భవన్ తన ప్రకటనలో కొన్ని వివరాలు వెల్లడిస్తున్నట్లు పేర్కొంది.
అక్టోబర్ 31 నాటికి శాసనసభ ఆమోదించిన పంపిన 81 బిల్లులలో దాదాపు 95 శాతం బిల్లులు నిర్ణీత కాలపరిమితి అంటే మూడు నెలల్లోనే ఆమోదించినట్లు పలు రికార్డులను రాజ్ భవన్ విడుదల చేసింది.
ఈ గణాంకాలు గవర్నర్ సకాలంలో బిల్లులను ఆమోదించారనే వాదనకు సాక్ష్యాలు అని ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం బిల్లులలో 60 శాతం(48) బిల్లులు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు.
మిగిలిన బిల్లులు అక్టోబర్ చివరి వారంలో ప్రభుత్వానికి అందించాము. కొన్ని బిల్లులు సమీక్షలో ఉన్నాయని గవర్నర్ కార్యాలయం తెలిపింది. అక్టోబర్ చివరి వారంలో అందిన ఎనిమిది బిల్లులలను ప్రస్తుతం పరిశీలన చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనలకు సంబంధించిన బిల్లులలతో సహ గవర్నర్ గతంలో తిరిగి పంపిన బిల్లులను ఆ తరువాత అసెంబ్లీ మరోసారి ఆమోదించిందని పేర్కొంది.
గవర్నర్ దాదాపు పది బిల్లులను నిలిపివేశారని, ఆ విషయాన్ని అసెంబ్లీకి తెలియజేశారని ఆ ప్రకటన పేర్కొంది. వీటిని రాష్ట్రపతికి రిజర్వ్ చేశారు. ఎందుకంటే ఇవి కేంద్రం ఆమోదించిన యూజీసీ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయి. అంతేకాకుండా శాసనసభ అధికార పరిధికి మించినవిగా గవర్నర్ గుర్తించారని పేర్కొంది.
న్యాయపోరాటం..
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించి రాష్ట్రపతికి 10 బిల్లులు రెండుసార్లు పంపినప్పటికీ వాటికి మోక్షం కలగట్లేదని తమిళనాడు వాదిస్తోంది. సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్ లో జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం జరిగింది. రాష్ట్రంలో శాసన సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ఆర్టికల్ 124 కింద న్యాయస్థానం తనకు అత్యున్నత అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు మూడు నెలల్లోగా ఆమోదం తెలపాలని ఆదేశించింది. దీనిపై రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు అసలు అలాంటి అధికారం ఉందా? అని పలు ప్రశ్నలు సంధించారు. ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలలో ఉంది.
Next Story

