తమిళనాడు: కిలోల కొద్ది బంగారం ఎత్తుకెళ్లిన దుండగుడు
x

తమిళనాడు: కిలోల కొద్ది బంగారం ఎత్తుకెళ్లిన దుండగుడు

వాటి విలువ రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా


Click the Play button to hear this message in audio format

తమిళనాడులో భారీ చోరి జరిగింది. దాదాపు 16 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రాలు చోరికి గురయ్యాయి. వీటి విలువ దాదాపు రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా. వివరాల్లోకి వెళితే మదురైలోని కలవాసల్ లో ఉన్న తనిష్క్ షోరుమ్ లో గురువారం తెల్లవారుజామున దోపిడి జరిగింది. ఈ షోరూమ్ ను కేవలం పది రోజుల క్రితమే ప్రారంభించినట్లు సమాచారం.

మదురై బైపాస్ పక్కన ఉన్న షోరుమ్ కు గురువారం ఉదయం ఉద్యోగులు చేరుకోగా, దాని వెనక ద్వారం పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. దీనితో దోపిడి విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి ఉద్యోగులు పనిముగించుకుని దుకాణానికి తాళం వేసి ఆ రోజు వెళ్లిపోయారు.
మదురై పోలీస్ కమిషనర్ ఎస్. రాజేందిరన్ ‘ ది ఫెడరల్ ’ తో మాట్లాడుతూ.. షోరూమ్ లోపల ఉన్న సీసీటీవీ పుటేజ్ లో ఒక అనుమానితుడు పై అంతస్తు నుంచి ఎవరూ ఉపయోగించని లిప్ట్ మార్గం ద్వారా ప్రాంగణంలోకి వెళ్లినట్లు కనిపించిందని తెలిపారు. ప్రాథమిక పరిశీలనలో ఈ దోపిడీకి ఒకే వ్యక్తి పాల్పడినట్లు సూచిస్తున్నప్పటికీ ఇందులో ఇతరుల ప్రమేయం ఉందో లేదో నిర్ధారించుకోవడానికి పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు.
ఇతర స్థానిక నివేదికల ప్రకారం భవనం వెనక భాగంలో జరుగుతున్న నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప పరంపరను ఎక్కి దొంగలు షోరూమ్ లోకి చొరబడ్డారని మొదట అనుమానించారు. వారు ఇంకా పనిచేయని ఎలివేటర్ షాప్ట్ ద్వారా ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సుమారు 48 కిలోల ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారని అందులో దాదాపు 30 శాతం దొంగ దోచుకుపోయాడని పోలీసులు పేర్కొన్నారు. షోరూమ్ యాజమాన్యం ఇంకా స్టాక్ తనిఖీ నిర్వహిస్తోందని దొంగలించబడిన ఆభరణాల కచ్చితమైన పరిమాణం తెలియదని రాజేందిరన్ ‘ది ఫెడరల్’ కు తెలిపారు
Read More
Next Story