తమిళనాడు: ఎన్డీఏ కూటమిలో చేరిన పీఎంకే
x
అన్నాడీఎంకే కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామితో పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్

తమిళనాడు: ఎన్డీఏ కూటమిలో చేరిన పీఎంకే

అన్నాడీఎంకే కార్యదర్శి సమక్షంలో కూటమిలో చేరినట్లు ప్రకటించిన అన్భుమణి


తమిళనాడు ఎన్నికలకు ముందు కీలక పరిణామం జరిగింది. అన్భుమణి రామదాస్ నేతృత్వంలోని పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏలో అధికారికంగా చేరింది.

చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, అన్భుమణి మధ్య బుధవారం కీలక సమావేశం తరువాత పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడింది. సమావేశం తరువాత పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. పీఎంకేతో సీట్ల పంపకం త్వరలోనే ఖరారు చేస్తామని వెల్లడించారు.

ఆనందంగా ఉంది: అన్భుమణి
అనంతరం అన్భుమణి మీడియాతో మాట్లాడుతూ.. కూటమిలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ‘‘మా కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న కూటమి ఇది. ఇది మాకు సంతోషకరమైన క్షణం. ఎన్నికల్లో మేము భారీ విజయం సాధిస్తాం, ఏఐడీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నిలకు అన్నాడీఎంకేతో కొత్తగా ఏర్పడిన పొత్తులో పీఎంకే కనీసం 23 సీట్లు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2021 లో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరి పోటీ చేసిన సీట్లు సంఖ్య కూడా ఇదే విధంగా ఉంది.
సీట్ల పంపకం పై పీఎంకే నాయకత్వం ఇంతకుముందే రెండుగా చీలిపోయింది. 2021 లో పార్టీ పనితీరు కారణంగా బేరాసారాల్లో దాని బలం కనిపించింది. అది ఉత్తర తమిళనాడులోని వన్నియార్ ఓట్లను ఏకీకృతం చేసింది.
కానీ ఫలితాలలో 5 సీట్లకే పరిమితం అయింది. అయితే డీఎంకే వ్యతిరేక కూటమిని బలోపేతం చేయడంపై ప్రధానంగా ఎన్డీఏ కూటమి దృష్టి పెట్టింది.
పీఎంకేలో అంతర్గత విభేదాలు..
గత ఏడాది నుంచి పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రామదాస్, కుమారుడు అన్బుమణి రామదాస్ మధ్య పొసగడం లేదు. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ స్థానాలు, పొత్తులపై రెండుగా విడిపోవడంతో వన్నియార్ కమ్యూనిటీ కూడా గందరగోళంలో పడింది. కుమారుడు అన్బుమణి బీజేపీ కూటమికి దగ్గరకు రావడానికి ప్రయత్నించగా, డీఎంకే వైపు వెళ్లాలని తండ్రి ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం జరిగిన పొత్తులో కేవలం అన్భుమణితో మాత్రమే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎస్ రామదాస్ పై అడిగిన ప్రశ్నకు పళనిస్వామి ఆయన సమాధానం ఇవ్వకుండా తెలివిగా తప్పించుకున్నారు.
అన్నాడీఎంకే, బీజేపీ, డీఎంకే ప్రతినిధులు కూడా ఎస్. రామదాస్ గ్రూపుతో చర్చలు జరుపుతున్నారని అయితే ఎవరితోనూ ఒప్పందం కుదరలేదని వర్గాలు చెబుతున్నాయి. ఈ పొత్తు పాక్షికంగా అన్నాడీఎంకే విజయంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పీఎంకేలోని వన్నియార్ ఓట్లలో గణనీయమైన భాగాన్ని వారు దక్కించుకున్నారు.
ఎన్డీఏ పోరాటం..
అమిత్ షా-పళని స్వామి మధ్య గత ఏడాది ఏప్రిల్ లో ఢిల్లీలో సమావేశం జరిగింది. తరువాత అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కలిసి పోటీ చేస్తాయని ఇరువురు నేతలు ప్రకటించారు. ఈ కూటమికి ఈపీఎస్ సీఎం అభ్యర్థిగా ఉన్నారు.
అప్పటి నుంచి ఇతర పార్టీలను ఆకర్షించడానికి ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. ఈ కూటమిలోకి టీటీవీ దినకరన్ పార్టీ, ఓ పన్నీర్ సెల్వం సహ తదితరులను తీసుకురావడానికి బీజేపీ బ్యాక్ డోర్ లో ప్రయత్నిస్తోంది.
ప్రేమలత విజయ్ కాంత్ నేతృత్వంలోని దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) జనవరి 9, 2026న కడలూర్ లో జరిగే బహిరంగ సభలో తన కూటమి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు.
అన్నాడీఎంకే, పీఎంకే బంధం కుదిరిన నేపథ్యంలో డీఎండీకేపై ఒత్తిడి పెరిగినట్లు భావించాల్సి ఉంటుంది. అధికారం డీఎంకేలో కూటమి నిర్మాణం చాలా స్పష్టంగా ఉంది. దీనికి పీఎంకే చేరడం దానికి నైతిక విజయం.
ఈ ఏడాది ఏప్రిల్- మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పరిణామం రాబోయే రోజులలో సంకీర్ణ కూటములను ఏర్పాటును తీవ్రతరం చేసే అవకాశం ఉంది.
Read More
Next Story