
అమిత్ షా తో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్
తమిళనాడు: అన్నాడీఎంకేతో బీజేపీ చేతులు కలపబోతుందా?
వచ్చే సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు, 1971 తరువాత వరుసగా రెండో సారి అధికారంలోకి రాలేని డీఎంకే
మహాలింగం పొన్నుస్వామి
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అంతకుముందే ద్రవిడపార్టీలు పొత్తు రాజకీయాలకు తెరతీశాయి. ప్రస్తుతం ఎన్డీఏ - అన్నాడీఎంకే మధ్య ఈ పొత్తు కుదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మాజీ సీఎం, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడీ పళని స్వామి మంగళవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
తమిళ మానిల కాంగ్రెస్ నాయకుడు జీకే వాసన్ ఢిల్లీలో షాను కలిసిన కొన్ని గంటలకే ఈ సమావేశం జరిగింది. గత ఏడాది కాలంగా ఏఐఏడీఎంకే - బీజేపీ కూటమి కోసం ప్రయత్నిస్తున్న వాసన్, రెండు పార్టీ మధ్య సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది రాష్ట్రంలో మరిన్ని ఊహాగానాలకు దారితీసింది.
రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు అనేవి ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణితో కలిసి ఈపీఎస్ పర్యటన జరిగింది.
రాజకీయ వ్యూహాలు..పొత్తులు..
చెన్నైలోని ఏఐఏడీఎంకే జిల్లా కార్యదర్శులతో వరుస చర్చల తరువాత ఈపీఎస్ ఈ పర్యటన ప్రారంభించారు. ఎన్నికల ముందు పార్టీ ప్రణాళికలను బలోపేతం చేయడానికి సమష్టి ప్రయత్నం జరుగుతుందని సూచించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు.
ఓపీఎస్ ప్రస్తుతం ఢిల్లీలోని కృష్ణ మీనన్ రోడ్ లోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యల పత్రాలను వివరించే కీలక పేపర్లను వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వాటిని ఆయన కేంద్రమంత్రికి సమర్పించే అవకాశం ఉందని కొన్ని వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఈపీఎస్ తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు. ఈ సమావేశంలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) మద్యం కేసుపై అధికార ప్రభుత్వంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కుంభకోణం రాష్ట్రంలో రాజకీయ వివాదానికే కేంద్ర బిందువుగా మారింది. ఈడీ చేసిన ప్రాథమిక దర్యాప్తులోనే దాదాపు వెయ్యి కోట్ల కుంభకోణం వివరాలు బయటకు వచ్చాయి.
ఈపీఎస్ ఈ అంశంపై డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ఆరోపణలను చట్టబద్దంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. కేంద్ర దర్యాప్తు సంస్థ చేస్తున్న దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారని, మీరు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు.
ఢిల్లీలో ఏఐఏడీఎంకే...
ఈపీఎస్ తన పర్యటన సందర్భంగా ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఏఐఏడీఎంకే కార్యాలయాన్ని సందర్శించడానికి కూడా సమయం తీసుకున్నారు. ఇది దేశ రాజధానిలో పార్టీ ఉనికిని బలపేతం చేసే లక్ష్యం తనకు ఉన్నట్లు స్పష్టం చేస్తోంది.
కొత్త కార్యాలయంలో పర్యటన చేయడం, వేలుమణి, మునుసామి వంటి సీనియర్ నాయకులను చేర్చుకోవడం పాటు బీజేపీ తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూడటం ఇవన్నీ ఎన్నికల ముందు ఐకమత్యం ప్రదర్శించాలని కూడా సూచిస్తున్నాయి.
ఈ సమావేశం గురించి బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈపీఎస్- షా మధ్య నాలుగు కీలక అంశాలు చర్చించారు. అందులో మొట్టమొదటిది తమిళనాడు బీజేపీ అధినేతగా కే. అన్నామలై కొనసాగడం గురించి అన్నాడీఎంకే ఆందోళన లేవనెత్తినట్లు తెలుస్తోంది.
అన్నామలై సమస్య..
అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజేపీ- అన్నాడీఎంకే పార్టీ మధ్య ఉన్న పొత్తును కే. అన్నామలై చేసిన వ్యాఖ్యలతో విచ్ఛిన్నం అయింది. ముఖ్యంగా దివంగత నేత జే. జయలలితపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను వివాదం రేపాయి.
జయలలితపై చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో సహింపలేనివని, ఆయన వల్లే మేము ఎన్డీఏ నుంచి వైదొగాల్సి వచ్చిందని కేసీ కరుప్పన్నన్ 2023 లో పేర్కొన్నారు. తరువాత ఇది ఒక సమస్యగా ఉంది.
బహిష్కరించబడిన వ్యక్తులు..
రెండో విషయం ఇంకా కీలకమైనది. ఇది అన్నాడీఎంకే అంతర్గత పరిస్థితుల గురించి. ఓ పన్నీర్ సెల్వం, వీకే శశికళ, టీటీవీ దినకరన్ వంటి నాయకుల పాత్రపై స్పష్టత కోరుతూ ఈపీఎస్ వర్గం చర్చను ప్రారంభించింది.
బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో ఈపీఎస్ వర్గంతో విభేదిస్తున్న ఈ వ్యక్తులు పాల్గొనకూడదని అన్నాడీఎంకే ప్రస్తుత నాయకత్వం కోరుకుంటోంది. ముఖ్యంగా శశికళ, దినకరన్ గతంలో అన్నాడీఎంకే లేదా కూటమిలో తిరిగి చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. కానీ వారు వస్తే అధికార వికేంద్రీకరణ మొదలవుతుంది. దీనికి మాజీ సీఎం వర్గం ఒప్పుకోవడం లేదు.
డీఎంకే వ్యతిరేకంగా వ్యూహాం..
మూడో అంశం అధికార డీఎంకేను ఇరుకున పెట్టేది. టాస్మాక్ మద్యం కేసు ఇతర అవినీతి కుంభకోణాలపై దర్యాప్తును ముమ్మరం చేయడానికి ఈడీ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగించి డీఎంకేను బలహీనపరచాలని కోరాయి. తమిళనాడులో ఈపీఎస్ ప్రధానంగా హైలైట్ చేసిన మరో అంశం శాంతి భద్రతలు. ఆ విషయంలో అధికార పార్టీని కార్నర్ చేయడానికి ఆయన కేంద్ర మద్దతును ఆశిస్తున్నారు. డీఎంకే ఎప్పుడూ కూడా వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదు. ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుని మరోసారి అధికారంలోకి రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.
పార్టీ చిహ్నాం..
నాలుగో అంశం.. పార్టీకి చెందిన రాజకీయ చిహ్నం అయిన రెండు ఆకుల గుర్తుకు సంబంధించినదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏఐఏడీఎంకే గుర్తింపుకు ఇది మూలస్తంభం లాంటిది. ఇది తన వర్గం దగ్గరే సురక్షితంగా ఉంచడానికి గురించి షాతో మాట్లాడినట్లు తెలిసింది.
‘రెండు ఆకుల చిహ్నం’ గతంలో న్యాయపోరాటాలకు దారి తీసింది. ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు దానిని ఈపీఎస్ వర్గానికే కేటాయించాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికల నాటికి పెద్ద కూటమి ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ అంశం గురించి కేంద్రం ద్వారా హమీ పొందేందుకు పళని స్వామి ప్రయత్నించారు. ఓ పన్నీర్ సెల్వం, శశికళ, టీటీవీ దినకరన్ వంటి ప్రత్యర్థుల నుంచి ఎటువంటి చర్చలు దీనిపై జరగకూడదని అడిగినట్లు తెలిసింది.
బలమైన కూటమి..
డీఎంకేను ఓడించడానికి బలమైన కూటమిని ఏర్పాటు చేయడంలో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈపీఎస్ ఇటీవల చేసిన ప్రకటన తరువాత ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఐఏడీఎంకే నాయకత్వాన్ని అంగీకరిస్తే ‘‘ప్రజా వ్యతిరేక’ డీఎంకేను గద్దె నుంచి దించడానికి తాను ఏ గ్రూపుతో నైనా భాగస్వామిగా ఉండటానికి సిద్దంగా ఉంటానని ఈ సందర్భంగా చెప్పారు. ఇంతకుముందు అన్నాడీఎంకేను అన్నామలై విమర్శించడం నేపథ్యంలో జాగ్రత్తగా అడుగులు వేయడానికి ఈ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది.
స్టాలిన్ ఎదురుదాడి...
ఈపీఎస్ ఢిల్లీ పర్యటన గురించి ముఖ్యమంత్రి స్టాలిన్ ఎదురుదాడి ప్రారంభించాడు. ఈపీఎస్ ఢిల్లీలో ఎవరిని కలిసినా ద్విభాషా విధానం గురించే మాట్లాడాలని డిమాండ్ చేశారు.
‘‘ఢిల్లీలో ఆయన ఎవరిని కలవబోతున్నారో మాకు తెలుసు. ఢిల్లిలో ఆయనతో కలవబోయే వ్యక్తితో ద్విభాష విధానం గురించి మాట్లాడాలి.’’ అని చెప్పారు.
రాష్ట్రంలో హిందీ వ్యతిరేక విధానాలు చాలాకాలంగా బలంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా హిందీని జాతీయ విద్యా విధానంలో భాగంగా తీసుకురావడం వలన మేము దానిని అమలు చేయమని డీఎంకే చెబుతోంది.
ఇలా చేస్తే మేము నిధులు ఇవ్వబోమని కేంద్రం మాట. దీనికి తోడు డీలిమిటేషన్ దక్షిణాదికి వ్యతిరేకంగా ఉందని, దీనిని ఆపాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా టాస్మాక్ మద్యం కుంభకోణం కేసులో పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం జరగడం పార్టీ పుట్టి మనగడం ఖాయమని ఆందోళన చెందుతోంది.
బీజేపీకి ఆహ్వానం తరువాత పరిణామాలు..?
ఢిల్లీలో ఈ పరిణామాలు జరగగానే, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నామలై మరో ప్రకటన చేశారు. డీఎంకే పాలనపై విసుగు చెందిన వారు మాతో కలవాలని ఆయన బహిరంగ ఆహ్వానం పలికారు. ఇదే మరింత ఆసక్తికి రేకేత్తించింది.
మీడియాను ఉద్దేశించిన ప్రసంగించిన ఆయన.. తమిళనాడులో బీజేపీ, ఎన్డీఏ బలంగా ఉన్నాయని అన్నారు. ఎన్డీఏను బలోపేతం చేయడానికి ఏ నాయకుడైన వచ్చి చేరితే మేము స్వాగతిస్తామని అన్నారు. డీఎంకేను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఉన్నవారేవరైనా మాతో చేరితే స్వాగతం పలుకుతామన్నారు.
టాస్మాక్ కేసు..
తమిళనాడు లో సంచలనంగా మారిన టాస్మాక్ మద్యం కేసు అవినీతి మొత్తం డీఎంకే నాయకత్వం వైపు వెళ్తున్న నేపథ్యంలో ఈ సమావేశం, ప్రకటనలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నామలై టాస్మాక్ కుంభకోణం డీఎంకే మానసపుత్రిక గా అభివర్ణిస్తున్నారు. ఈడీ ఈ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తి రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీకి అత్యంత సన్నిహితుడు అని ఆరోపించారు. అయితే వీటిని డీఎంకే ఖండించింది. తమ పార్టీని ఇబ్బంది పెట్టడానికే ఇలా వ్యవహరిస్తున్నారని ఈ పార్టీ ఎదురుదాడి చేస్తోంది.
భాషా విధానాలు..
భాషా విధానాలు- అవినీతి అంశాలే వచ్చే ఎన్నికలలో ప్రధాన ప్రచారాస్త్రాలుగా నిలవబోతున్నాయి. ప్రస్తుతం రాజకీయం వేగంగా మారుతున్న నేపథ్యంలో తిరిగి మరోసారి అధికారంలోకి రావడానికి అన్నాడీఎంకే, బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. 1971 తరువాత డీఎంకే ఎప్పుడూ వరుసగా రెండో సారి అధికారంలోకి రాలేదు. ఇది ఆ పార్టీకి ఒక సవాల్ అని రాజకీయ విశ్లేషకుడు రవీంద్రన్ దురైస్వామి అభిప్రాయపడ్డారు.
చారిత్రాత్మకంగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య స్థిరమైన అధికార మార్పిడిని చూసింది. డీఎంకే చివరిసారిగా 1971 లో కరుణానిధి నాయకత్వంలో వరుసగా అధికారంలో కొనసాగింది.
ప్రసుతం ఢిల్లీ సమావేశం గురించి అన్నాడీఎంకే ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈపీఎస్ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన బుధవారం ప్రసంగించబోతున్నారు. ఆ తరువాత చర్చల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Next Story