మళ్ళీ రంగ ప్రవేశం చేయబోతున్న శశికళ: అన్నాడీఎంకేపై పట్టుకోసం ప్రయత్నాలు
x

మళ్ళీ రంగ ప్రవేశం చేయబోతున్న శశికళ: అన్నాడీఎంకేపై పట్టుకోసం ప్రయత్నాలు

అన్నాడీఎంకే పార్టీని హస్తగతం చేసుకోవడానికి వికే శశికళ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తాను మరోసారి రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు.


తమిళనాడులో మరోమారు అన్నాడీఎంకే చీలిపోనుందా? లేదా ప్రస్తుత పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ సీఎం ఎడప్పాడీ పళని స్వామిని బలవంతంగా బయటకు పంపుతారా? అయితే ఎవరూ పంపబోతున్నారు. ఈ ప్రశ్నలపై సరైన సమాధానం దొరకాలంటే తమిళనాడులో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే అర్ధమవుతుంది. తాజాగా అన్నాడీఎంకే ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు వికే శశికళ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. 2026లో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని, ‘అమ్మ’ పాలన అందిస్తామని మాజీ సీఎం జయలలిత నెచ్చెలి అయిన శశికళ రాజకీయ ప్రకటన చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏఐడీఎంకే పార్టీ ఘోరంగా ఓడిపోవడం, అధికారంలో ఉన్న డీఎంకేకు పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండటంతో మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వికే శశికళకు చక్కని అవకాశంగా దొరికినట్లు అయింది. అందుకే రాజకీయ ప్రకటన చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ, పార్టీ సింబల్ పై పట్టుసాధించేందుకు తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
ప్రతిపక్ష నేత హోదాలో పళనిస్వామి సరైన ప్రశ్నలు అడగనందున తాను “ప్రతిపక్ష పార్టీ”గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని కూడా ఆమె రాజకీయ ప్రకటనలు చేశారు .
"నేను చాలా బలంగా ఉన్నాను"
నేను రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చేసింది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెన్నైలోని తన ఇంటి ముందుకు వచ్చిన మద్ధతుదారులను ఉద్దేశించి శశికళ అన్నారు. పార్టీ ఏకీకృతం చేయాల్సిన ఆమె సంకల్పించినట్లు తెలుస్తోంది. ఇంతకుముందే శశికళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటనలు సైతం జరిపింది. తాజాగా మరో షెడ్యూల్ చేయాలని భావిస్తున్నారు.
"తమిళనాడు ప్రజలు కచ్చితంగా మా వైపు ఉన్నారు.... నేను చాలా బలంగా ఉన్నాను.. అన్నాడీఎంకే శకం ముగిసిందని అనుకోవద్దు. నా ఎంట్రీ (రీ-ఎంట్రీ) ప్రారంభమైంది" అని ఆమె తన అభిమానులు, కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ‘అమ్మ పాలన’కు నాంది పలుకుతామన్నారు. శశికళ త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలను ప్రారంభిస్తారని, ప్రభుత్వంలో ఉన్న డీఎంకేపై పలు ప్రశ్నలు సంధిస్తారని, దానికి సమాధానాలు చెప్పాలని అన్నారు.
కుల రాజకీయాలు వద్దు
ప్రస్తుతం ఏఐడీఎంకేలోకి కుల రాజకీయాలు ప్రవేశించాయని, ఎవరి పేరు ఉద్దేశించకుండానే శశికళ పరోక్షంగా పళని స్వామిపై విమర్శలు గుప్పించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్, దివంగత మాతృమూర్తి “అమ్మ జయలలిత” పెంచి పోషించిన పార్టీలో ఇలాంటి కుల ఆధారిత రాజకీయాలను తీసుకురావడాన్ని తాను, పార్టీ కార్యకర్తలు సహించరని శశికళ తేల్చిచెప్పారు. ఆమెకు కుల ప్రాతిపదికన ఏమైనా ఉంటే 2017లో ఎడప్పాడి కె. పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసేది కాదని శశికళ వాదించారు. ఎంజీఆర్ కాలం నుంచి పార్టీకి అండగా నిలిచిన రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంత ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పళని స్వామిని ముఖ్యమంత్రిని చేశారన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ నాలుగో స్థానానికి దిగజారిందని, కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
పళనిస్వామిపై దాడి
శశికళ ప్రస్తుతం నేరుగా కుల ఆధారిత రాజకీయాలు, ఎన్నికల పరాజయం వ్యాఖ్యలు మాజీ సీఎం పళని స్వామిని లక్ష్యంగా చేసుకున్నాయని తెలుస్తోంది. 2017లో పళని స్వామిని శశికళే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఇదే సమయంలో ఆమె పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2016 డిసెంబర్ లో జయలలిత మరణం తరువాత పార్టీ లో శశికళే నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.
విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో విక్రవాండి ఉప ఎన్నికను బహిష్కరించడం సరికాదన్నారు. జూలై 10న జరగనున్న ఉప ఎన్నికను అన్నాడీఎంకే, డీఎండీకే బహిష్కరించాయి. బస్సుల కొనుగోలు వంటి సమస్యలపై అధికార డీఎంకే పాలనను లక్ష్యంగా చేసుకుని, “ప్రతిపక్ష నాయకుడు (పళనిస్వామి) తప్పక అడగాల్సిన ప్రశ్నలు వేయకపోతే, నేను ప్రతిపక్షాన్ని, నేను (ఆ) ప్రశ్నలు అడుగుతున్నాను” అని ఆమె అన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తామని, అన్నాడీఎంకేను ఏకం చేసి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
పళనిస్వామి ఎదుగుదల
మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం, అతని మద్దతుదారులను పళనిస్వామి బహిష్కరించారు, తరువాత అన్నాడీఎంకేలో నాయకుడిగా అవతరించారు. ఆతరువాత టీటీవీ దినకరన్, సహ శశికళ బంధువులు మొత్తం పార్టీ నుంచి వైదొలిగారు.


Read More
Next Story