నంబాల మృతి తర్వాత పెరిగిన మావోల లొంగుబాట్లు
x

నంబాల మృతి తర్వాత పెరిగిన మావోల లొంగుబాట్లు

కొత్తగూడెంలో మరో 17 మంది మావోయిస్ట్‌లు లొంగిపోయారు.


నంబాల కేశవరావు మరణం తర్వాత మావోయిస్టుల లొంగుబాట్లు పెరిగాయి. అతడు మరణించిన రెండు రోజులకే ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 17 మంది మావోయిస్ట్‌లు పోలీసుల ముందు లొంగిపోయారు. తాజాగా ఇప్పుడు కొత్తగూడెంలో మరో 17 మంది మావోయిస్ట్‌లు లొంగిపోయారు. ఈ విషయాన్ని ఎస్పీ రోహిత్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం క్యాడర్‌కు చెందిన ఇద్దరు, పార్టీ సభ్యులు నలుగురు, మిలీషియా సభ్యులు 11 మంది ఉన్నట్లు వివరించారు. తెలంగాణలో మావోయిస్ట్‌లకు ఆశ్రయం ఉండే పరిస్థితులు ఇకపై ఉండవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికయినా మిగిలిన మావోలు కూడా ఆయుధం వీడి ఆశ్రయం కోసం రావాలని పిలుపునిచ్చారు.

Read More
Next Story