
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ నజర్
పార్టీ నియోజక వర్గ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్ధేశం
"జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో మీకు అవసరం లేదు.ఈరోజు నుంచే ఎన్నికలు జరుగుతున్నాయన్న భావనతో పని చేయండి. ఉప ఎన్నికను అంత ఈజీగా తీసుకోవద్దు" అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ కు చెందిన పార్టీ నాయకులు ,బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ సమావేశమయ్యారు. 'మాగంటి గోపీనాథ్ అకాల మరణం చాలా బాధాకరం. అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్లాస్, మాస్ అందరూ ఉంటారు. హైదరాబాద్‌లో లక్ష మంది పేదలకు జీవో 58, 59 కింద పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలవాలి'అంటూ దిశా నిర్దేశం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, బీఆర్ఎస్ నే గెలిపించారని చెప్పిన కేటీఆర్ ,నగరంలో హైడ్రా పేరుతో పేదలపై ప్రభుత్వం చేస్తున్న జులుం కూడా ప్రజలలోకి తీసుకెళ్లాలని తెలిపారు. పేద వారికి మాత్రమే హైడ్రా నిబంధనలు వర్తిస్తాయా? అంటూ ప్రశ్నించారు.20 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క మంచి పని కూడా చేయలేదని, నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో మతం పేరుతో కేసీఆర్ రాజకీయం చేయలేదని ,ఆ ప్రయత్నాలు చేస్తోంది,బీజేపీ , కాంగ్రెస్ లేనని అన్నారు. జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా మరోమారు ఎగరడం ఖాయమన్నారు.
Next Story