భర్త మోసం చేస్తే, కన్నవాళ్ళు నిర్భందించారు... చివరకు బ్రైన్ డెడ్
x
Married woman suicide

భర్త మోసం చేస్తే, కన్నవాళ్ళు నిర్భందించారు... చివరకు బ్రైన్ డెడ్

భార్య జీతం తీసుకోవటమే కాకుండా ఎదురు వేధింపులు కూడా మొదలయ్యాయి


ఇదొక వివాహిత శాడ్ స్టోరి. ప్రేమించి పెళ్ళిచేసుకున్న భర్త మోసంచేశాడు. పుట్టింటికి చేరిన కూతురుని తల్లి,దండ్రులు గదిలోపెట్టి నిర్భందించారు. దాంతో తప్పించుకునేందుకు ఆమెచేసిన ప్రయత్నంలో చివరకు బ్రైన్ డెడ్ గా మిగిలిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే అమీర్ పేట్(Ameerpet) లోని రజిత సైకాలజీలో డిగ్రీచేసింది. ఇంటర్న్ షిప్పులో భాగంగా బంజారాహిల్స్(Banjara Hills) లోని పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేసేది. అదేసమయంలో కేపీహెచ్బీకి(KPHB) చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రోహిత్ తో పరిచయమైంది. పరిచయంకాస్త ప్రేమగా మారటంతో పెద్దలు మాట్లాడుకుని వివాహం జరిపించారు.

వివాహమై అత్తారింటికి వచ్చిన రజితకు అసలు విషయం తెలిసింది. అదేమిటంటే రోహిత్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాదు కదా అసలు ఏ ఉద్యోగమూ చేయటంలేదు. ఏ పనీచేయకుండా తిరుగుతుంటాడంతే. రజిత తెచ్చిన జీతాన్ని తీసుకుని జల్సాగా గడిపేస్తున్నాడు. భార్య జీతం తీసుకోవటమే కాకుండా ఎదురు వేధింపులు కూడా మొదలయ్యాయి. దాంతో భార్య,భర్తల మధ్య తరచూ గొడవులు జరిగేవి. భర్త వేధింపులపై ఫిర్యాదుచేస్తే మామగారు, మరిది కూడా రోహిత్ కే మద్దతుగా నిలిచారు. ఒకరోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవ అవటంతో రాత్రి నిద్రమాత్రలు మింగేసింది రజిత. విషయం తెలుసుకున్న రోహిత్ కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

కూతురు నిద్రమాత్రలు మింగి ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న తల్లి, దండ్రులు కాస్త కోలుకోగానే రజితను పుట్టింటికి తీసుకెళ్ళిపోయారు. అమీర్ పేటలోని ఒక అపార్ట్ మెంట్లోని 4వ అంతస్తులో రజిత తల్లి, దండ్రులు ఉండేవారు. పుట్టింట్లో ఏమైందో తెలీదుకాని రజితను తల్లి, దండ్రులు తమింట్లోని ఒక బెడ్ రూములో ఉంచి తాళం వేశారు. ఎన్నిరోజులు తాళంవేసి గదిలోనే ఉంచారో ఏమో తెలీదు కాని పోయిననెల 28వ తేదీన ఇంట్లోనుండి తప్పించుకునేందుకు రజిత ప్రయత్నించింది. 4వ అంతస్తులోని తమింట్లో కిటీకికి చీరలు గట్టిగా ముడేసింది. ఆ చీరలను పట్టుకుని కిటికీలో నుండి బయటకు దిగాలని ప్రయత్నించింది. మెల్లిగా చీరలను పట్టుకుని కిందకు చేరాలన్నది రజిత ఉద్దేశ్యం. అయితే కొంచెం కిందకు దిగగానే చేతులు పట్టుతప్పి చీరను వదిలేసింది. దాంతో పైనుండి రజిత పడిపోయింది. కిందపడిన రజిత తలకు తీవ్రగాయం అవటంతో అపస్మారకంలోకి వెళిపోయింది.

విషయం తెలియగానే తల్లి,దండ్రులు, అపార్ట్ మెంట్లోని వాళ్ళ సాయంతో ఆసుపత్రిలో చేర్పించారు. రజితకు వైద్యంచేసిన డాక్టర్లు బుధవారం బ్రైన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ప్రేమించి పెళ్ళిచేసుకున్న భర్త మోసం చేయటం, పుట్టింటి వాళ్ళు గదిలో పెట్టి తాళంవేసి బంధించటంతో తప్పించుకునేందుకు రజిత చేసిన దుస్సాహసం చివరకు బ్రైన్ డెడ్ గా ముగిసింది.


Read More
Next Story