మూడు బిల్లులు పెట్టడానికి సర్కార్ సిద్ధం..
x

మూడు బిల్లులు పెట్టడానికి సర్కార్ సిద్ధం..

విపక్షాలపై కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న ప్రభుత్వం.


తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆదివారం మూడు బిల్లులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వాటిపై వాడివేడి చర్చ జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీసు శాఖ. ఉదయం ప్రభుత్వ బిల్లులపై చర్చ జరుగుతుంది. తొలుత పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెడతారు. ఆ తర్వాత కళేశ్వరం కమిషన్ అందించిన నివేదికపై చర్చ జరుగుతుంది. వాటి తర్వాత తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల(రిజిస్ట్రేషన్, క్రమబద్దీకరణ) చట్టాన్ని రద్దు చేయడానికి సంబంధించిన బిల్లును సీఎం రేవంత్ సభలో ప్రవేశపెడతారు. దానిపై చర్చించి ఆమోదానికి కోరనున్నారు.

ప్రతిపక్షాలపై కఠినం..

కీలక బిల్లులు, అంశాలపై చర్చలు జరగనున్న క్రమంలో ప్రతిపక్షాల ప్రవర్తనపై కాస్తంత కఠినంగా వ్యవహరించాలని కూడా ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. స్పీకర్ పోడియం దగ్గర వస్తే.. వచ్చిన నేతపై వేటు వేయాలని భావిస్తోంది. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల తీరును నిశితంగా పరిశీలించనుంది. సభ ప్రొసీడింగ్స్‌కు ఆటంకం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడకూడదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలోనే కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ, దానిపై తీసుకునే నిర్ణయం కీలకంగా మారనున్నాయి.

ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు ఇవే..

1. తెలంగాణ పురపాలక సంఘాల (మూడవ సరవణ) బిల్లు 2025

2. తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సరవణ) బిల్లు 2025

3. తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల(రిజిస్ట్రేషన్, క్రమబద్దీకరణ) చట్టాన్ని రద్దుకు బిల్లు

అనంతరం కాళేశ్వరం కమిషన్ నివేదికపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

Read More
Next Story