
లుక్మీ టేస్టే వేరబ్బా
బయట క్రంచీగా, లోపల మెత్తని కీమా సమోసా...లుక్మీ
నేషనల్ మీట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఎంఆర్) నిర్వహించిన సర్వేలో "భారత దేశంలో ఓ వ్యక్తి మాంసాహార వినియోగం సంవత్సరానికి 7.1 కిలోలుగా ఉంది. అయితే తెలంగాణలో ఒక వ్యక్తి సగటు మాంసం వినియోగం సంవత్సరానికి 23.97 కిలోలు, నెలకు 2కిలోలుగా సర్వే తేల్చింది. ఇంతగా మాంసం తింటున్న ప్రజలు దేశంలో మరే రాష్ట్రంలోను లేరని సర్వే వెల్లడిస్తున్నది. దీంతో మాంసహారం వినియోగంలో దేశంలోనే తెలంగాణ టాప్ గా నిలిచింది. ఎందుకంటే ఇక్కడ స్నాక్స్‌లో కూడా మటన్ తింటారు".
"లుక్మీ..హైదరాబాదీలకు చెందిన ఒక ప్రసిద్ధ చిరుతిండి. ఇది హైదరాబాద్ యొక్క స్వంత సమోసా. హైదరాబాద్ వెడ్డింగ్స్‌లో, ప్రత్యేక సందర్భాల్లో లుక్మీ ని స్టార్టర్‌గా వడ్డిస్తారు. కారంగా, ఉప్పగా, రుచికరంగా ఉంటుంద" ని షీక్ కబాబ్ తయారీలో నిపుణుడు షేక్ దస్తగీర్ చెప్పారు.
హైదరాబాదీ లుక్మి సమోసా యొక్క హైదరాబాదీ వెర్షన్. అసలు వెర్షన్‌లో, స్పైసీ ఆలూ మిశ్రమాన్ని త్రిభుజాకార పేస్ట్రీ క్రస్ట్‌లో నింపుతారు. ఈ హైదరాబాదీ-శైలి సమోసా ఆలూ స్థానంలో మటన్ ఖీమా నింపుతారు. త్రిభుజానికి బదులుగా, ఇది చదరపు ఆకారంలో, దిల్ షేప్ పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది. 'లుఖ్మి' అనే పదానికి ఉర్దూలో 'ముక్క' అని అర్థం. "నేను మొదటిసారి హైదరాబాదీ లుక్మీ తిన్న అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. అది హైదరాబాద్ ఓల్డ్ సిటీ మధ్యలో ఉన్న ఒక చిన్న, సందడిగా ఉండే స్టాల్ నుండి. సుగంధ ద్రవ్యాల సువాసన, వేడి నెయ్యితో గాలి దట్టంగా ఉంది. నేను తిన్నది కేవలం స్నాక్స్ కాదు. అది ఒక అద్భుతం. మసాలా దినుసులతో కూడిన రుచికరమైన, మాంసంతో వున్న లుక్మీ, క్రిస్పీగా, పొరలుగా విడిపోతూ ఆ రుచి మరపురాని అనుభూతినిచ్చిందని" అంజద్ అలీ ఖాన్ ది ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు.
అసలైన సీఖ్ కబాబ్ రెసిపీః
"గొర్రె/మేక మాంసం ఖీమాను స్పెషల్ మాసాలతో దట్టించి షీక్ ఖబాబ్‌గా నిప్పుపై కాల్చుతారు. అలా నిప్పుపై కాలిన షీక్ కబాబ్‌ను చిన్న చిన్న పీసులుగా చేసి స్వ్కేర్ షేప్ లేదా దిల్ షేప్‌లో నింపుతారు. లుక్మీని బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించి, పుదీనా చట్నీ, టొమాటో కెచప్‌తో స్టార్టర్‌గా వడ్డిస్తారని" చెఫ్ సయ్యద్ ఉస్మాన్ అలీ చెప్పారు.
మృదువైన కబాబ్‌ల కోసం మటన్ ఖీమాను మెత్తగా రుబ్బుతారు. బోల్డ్ ఫ్లేవర్‌ల కోసం జీలకర్ర, కొత్తిమీర, ఎర్ర కారం పొడి, గరం మసాలా వంటి సాంప్రదాయ సుగంధ ద్రవ్యాలను కలుపుతారు. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను కలిపి, కబాబ్‌లను ఇనుప షీక్ చుట్టూ అమర్చి నిప్పుపై కాల్చుతారు. కబాబ్స్ ని అన్ని వైపులా సమానంగా ఉడికేలా తిప్పాలి. ఉడకడానికి 10 నిమిషాలు పడుతుంది. ఉడికిన తరువాత ఘీతో బ్రష్ చేయండి. లేదా చల్లడం చేస్తారు.
హైదరాబాదీ లుఖ్మిని ఎలా తయారు చేస్తారుః
1. లుఖ్మి కోసం పిండిని సిద్ధం చేసుకుంటారు. దీని కోసం, ఒక గిన్నెలో మైదా, నిమ్మరసం, వెన్న, ఉప్పు, నీరు వేసి బాగా కలిపి మెత్తని పిండిలా చేస్తారు. మ్యారినేట్ చేసి మూతపెట్టి కొన్ని నిమిషాలు అలా వదిలేస్తారు.
2. స్టఫింగ్ కోసం, పాన్‌లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
3. తరువాత, హల్ది, గరం మసాలా, ఎర్ర కారం, కొత్తిమీర పొడితో సహా అన్ని పొడి మసాలా దినుసులను, పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీరతో బాగా కలుపుతారు.
4. పిండిలో ఒక చిన్న భాగాన్ని తీసుకొని దీర్ఘచతురస్రాకారంలోకి చుట్టండి. తయారు చేసిన కీమా మిశ్రమాన్ని మధ్యలో ఒక చెంచా వేసి, ఫోర్క్ ఉపయోగించి అంచులను బాగా మూసివేయండి.
6. కడాయిలో నూనె వేడి చేసి, అవి బంగారు గోధుమ రంగులోకి మరియు క్రిస్పీగా మారే వరకు డీప్-ఫ్రై చేయండి. వేడిగా వడ్డించి ఆనందించండి!
ఇంకెందుకు ఆలస్యం,హైదరాబాదీ క్లాసిక్ స్నాక్ లుక్మీ ని మీరు ఓసారి ప్రయత్నించండి.