బీఆర్ఎస్ బలంగా పోటీ ఇవ్వలేక పోయింది.. ఎందుకు?
x

బీఆర్ఎస్ బలంగా పోటీ ఇవ్వలేక పోయింది.. ఎందుకు?

గెలిచింది నవీన్ యాద‌వ్ అయినా.. సి.ఎం. రేవంత్ తానే అభ్యర్దిలా పని చేసారు!


జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 24 వేల 729 ఓట్ల ఆధిక్య‌త‌తో ఘ‌న విజ‌యం సాధించింది. ప్ర‌తి రౌండ్ లోనూ, అన్ని డివిజ‌న్‌ల‌లో నవీన్ యాదవ్ కే, బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కంటే అధిక ఓట్లు వ‌చ్చాయి. పోస్టల్ బ్యాలెట్ నుంచి కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఎన్నికల్లో గెలిచింది నవీన్ యాద‌వ్ అయినా.. సి.ఎం. రేవంత్ తానే అభ్యర్దిలా పని చేసారు. ఈ గెలుపు ద్వారా సి.ఎం. తన పట్టు మరింత పెంచుకున్నారు. ఈ విజయం కాంగ్రెస్‌కి తెలంగాణ వ్యాప్తంగా బూస్ట్ ఇస్తుంది. ప్రజలు తమతోనే ఉన్నారని కాంగ్రెస్ చెప్పుకునేందుకు ఇది నిదర్శనంగా మారింది. జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ నేత‌లు సంబరాల్లో మునిగిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ వరుసగా రెండో సిట్టింగ్ స్థానం కోల్పోయింది.

పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఇక్కడ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు అనుకున్నారు.... అయితే బీఆర్ఎస్ బలంగా పోటీ ఇవ్వలేకపోయింది. ఎందుకు?

1. కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్‌ని గెలిపిస్తే, ఏం లాభం? నవీన్ యాదవ్ స్థానికుడు.. ఇక్కడి ప్రజలతోనే ఉంటున్నాడు అనేది.. బాగా ప్ర‌చారం జ‌రిగింది.

2. ఈ ఎన్నికల్లో ఎంఐఎం బరిలో దిగలేదు. కానీ కాంగ్రెస్‌కి సపోర్ట్ ఇచ్చింది. మజ్లీస్ మద్దతు ఇచ్చినప్పటికీ.. రేవంత్ ఏమాత్రం నమ్మలేదు. అజహరుద్దీన్‌కి మంత్రి పదవి ఇచ్చారు. ఎంఐఎం స‌పోర్ట్ + అజ‌హ‌రుద్దీన్ హోదాతో గులాబీ పార్టీకి సంబంధించిన మైనారిటీ ఓటు బ్యాంకు మొత్తాన్ని చీలిపోయింది.పెద్ద సంఖ్య‌లో ముస్లిం ఓట్ కాంగ్రెస్ వైపు టర్న్ అయింది.

3. ఇటీవ‌ల న‌గ‌రంలో భారీగా వర్షాలు పడ్డాయి. అయినా రోడ్లపై నీరు ఎక్కువగా నిలవలేదు. కారణం.. హైడ్రా చర్యలే అని ప్రజలు నమ్మారు. చెరువులు బాగుపడటం, కబ్జా స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వంటి చర్యలు.. కాంగ్రెస్‌కి ప్లస్ అయింది.

4. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా.. వాగ్దానం చేసిన పథకాలన్నీ ఇస్తున్నామంటూ.. సి.ఎం. రేవంత్ రెడ్డి ప్రజలకు అర్థమయ్యేలా, ప్ర‌జ‌ల‌కు దగ్గరయ్యేలా ప్రచారం చేశారు. సి.ఎం. ప్ర‌చార శైలి ప్రజలకు నచ్చింది.

5. జూబ్లీహిల్స్‌లో సెటిల‌ర్స్ ఎక్కువే. వారిలో చాలా మందికి ఇదివరకు టీడీపీతో అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని క‌మ్మ ఓట‌ర్ల మీటింగ్‌లో సి.ఎం. రేవంత్ మాట ఇవ్వడం.. కాంగ్రెస్ పట్ల పాజిటివ్‌గా మారారు.

6. సానుభూతిని బ్రేక్ చేయడానికి పిజెఆర్ పేరు వాడుకున్నారు. కేసీఆర్....పి జనార్దన్ రెడ్డి కుటుంబానికి ఎలాంటి ద్రోహం చేశారో త‌న‌దైన స్టైల్‌లో ఉదాహరణలతో చెప్పారు. అలా మాగంటి కుటుంబానికి సానుభూతి దక్కకుండా గండి కొట్టాడు.

7. ఇంటి ఆడబిడ్డ నే కేటీఆర్ పట్టించుకోవడం లేదని.. మాగంటి సునీతను మాత్రం ఏం పట్టించుకుంటారని రేవంత్ ప్రశ్నించాడు. పైగా కవిత చేస్తున్న ఆరోపణలను పదే పదే ప్రస్తావించాడు.

8. సునీత మాగంటి గోపీనాథ్ ను లీగల్ గా పెళ్లి చేసుకోలేదు అనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాడు

9. సినీ కార్మికుల ఓట్లు ఆక‌ట్టుకోవ‌డానికి, 20% వాటా సినీ కార్మికులకు ఇస్తేనే టికెట్, రేట్లు పెంచుతానని ప్రకటించాడు. అలా సినీ కార్మికులకు కూడా అత్యంత దగ్గరగా కనెక్ట్ అయిపోయారు.

10. హైడ్రా - బుల్డోజర్లు అంటూ బీఆర్‌ఎస్ చేసిన ప్రచారం వ‌ర్క్ అవుట్ కాలేదు.ఎండ్ యాంక‌ర్ఃజూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫ‌లితాలు సి.ఎం. రేవంత్‌రెడ్డికి భారీ ఊరటనిచ్చాయి. జూబ్లీ విజ‌యంతో అంతర్గత శత్రువుల నోళ్ల‌కు తాళ్లాలు ప‌డ్డ‌ట్ట‌యింది.

Read More
Next Story