కాళేశ్వరం నిండా కేసీఆర్ వేలి ముద్రలే!
x
మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లు

'కాళేశ్వరం' నిండా కేసీఆర్ వేలి ముద్రలే!

కర్త, కర్మ, క్రియ ఆయనే అన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్


కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పలు లోపాలతోపాటు అక్రమాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నాటి మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఈటెల రాజేందర్, అధికారులు కారణమని కమిషన్ పేర్కొంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణ అధికారుల కమిటీ అధ్యయనం చేసి దీనిలోని సారాంశాన్ని సిద్ధం చేసింది. అధికారుల కమిటీ నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి.




కాళేశ్వరం తప్పులకు కేసీఆర్ కీలక బాధ్యుడు

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణానికి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి ఏకపక్షంగా నిర్మించారని కమిషన్ పేరొందని అధికారుల కమిటీ ప్రాథమికంగా వెల్లడించింది.మూడు బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలకు, ప్రణాళిక, ప్రాజెక్టు నిర్మాణ, ప్రాజెక్టు ఆపరేషన్, నిర్వహణ లోపాలకు ప్రధాన కారణం కేసీఆర్ అని అధికారుల కమిటీ తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణంలో సరైన ప్రణాళిక రూపొందించక పోవడం, డిజైన్లు, నిర్మాణ లోపాలు,ప్రాజెక్టు ఆపరేషన్, నిర్వహణ లోపాల వల్ల బ్యారేజీ దెబ్బతిందని కమిటీ తెలిపింది. సీఎం అపరిమిత జోక్యం వల్ల ప్రాజెక్టు దెబ్బతిని ప్రజా ధనం దుర్వినియోగం అయిందని తేల్చారు.అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బయారేజీల నిర్మాణ నిర్ణయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. కాళేశ్వరం నిర్మాణంలో నిపుణుల కమిటీ నివేదికను అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు కావాలని పరిగణనలోకి తీసుకోలేదని కమిటీ తెలిపింది. అప్పటి ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాస్ట్రంలో నిధుల వినియోగాన్ని పట్టించుకోలేదని, ఆర్థిక జవాబుదారీతనాన్ని పాటించలేదని కమిషన్ పేర్కొంది.

నిపుణుల కమిటీ నివేదిక చెత్తబుట్ట దాఖలా
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం వల్ల అధిక సమయం పడుతుందని, అధిక వ్యయం అవుతుందని జీఓఆర్టీ నంబరు 28 పేరిట 2015 జనవరి 21వతేదీన ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తిరస్కరించింది. మేడిగడ్డ వద్ద కాకుండా వేమనపల్లి వద్ద బ్యారేజీని నిర్మించాలని సూచించినా అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు ఈ నివేదికను చెత్తబుట్ట దాఖలా చేసి మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మించారని తేలింది.ప్రాజెక్టు డిజైన్లలో లోపాలు, నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని కమిషన్ తేల్చింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తికాక ముందే ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టరుకు మేలు చేసేలా ప్రాజెక్టు పూర్తి చేసినట్లు కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేయడాన్ని కమిషన్ ఎత్తి చూపించింది.

అధికారుల పాత్ర
అప్పటి తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ కె జోషి నిపుణుల కమిటీ నివేదికను పట్టించుకోలేదని తేల్చారు. ప్రాజెక్టకు పరిపాలనా అనుమతులు ఇవ్వడంలో బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించారని కమిటీ తెలిపింది. అప్పటి సీఎం సెక్రటరీ అయిన స్మతా సబర్వాల్ ఈ ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతులు, బిజినెస్ రూల్స్ పాటించకున్నా పట్టించుకోలేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కమిటీ తెలిపింది.

సీడబ్ల్యూసీకి తప్పుడు సమాచారం
తెలంగాణ నీటిపారుదల శాఖ అప్పటి ఇంజినీర్ ఇన్ చీఫ్ సి మురళీధర్ నిపుణుల కమిటీని పట్టించుకోలేదని, సెంట్రల్ వాటర్ కమిషన్ కు తప్పుడు సమాచారం అందించారని, రివైజుడ్ అంచనాలను తప్పుగా ప్రతిపాదించారని అధికారుల కమిటీ తెలిపింది. చీఫ్ ఇంజినీర్ అయిన బి హరిరామ్ నిపుణుల కమిటీ నివేదికను పట్టించుకోకపోగా, ఆయన కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ కు తప్పు సమాచారం పంపించారు.

బ్యారేజీల నిర్మాణంలో లోపాలెన్నో...
గోదావరి నదిలో తుమ్మిడిహెట్టి వద్ద నీరు లేదని కారణం చెప్పి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించారని కమిషన్ ఆక్షేపించిందని అధికారుల కమిటీ తెలిపింది. కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలకు కేబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వ బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని తేలింది. 2026 ఫిబ్రవరి 11వతేదీన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.71,436 కోట్లు గా ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలో పేర్కొన్న సీఎం దీని నిర్మాణ వ్యయాన్ని అడ్డగోలుగా పెంచి డీపీఆర్ దాఖలు చేశారని కమిటీ తెలిపింది. ఈ ప్రాజెక్టు టర్న్ కీ పద్ధతిలో నిర్మాణం, నిర్వహణ కాంట్రాక్టు ఇవ్వాలని సెంట్రల్ వాటర్ కమిషన్ సలహా ఇచ్చినా దాన్ని కాదని లమ్ సమ్ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పొడవు, ఫ్లడ్ బ్యాంక్, డిజైన్లను మార్పులు చేశారని అధికారులు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో స్పెసిఫికేషన్లు, డిజైన్లు, డ్రాయింగ్ లు మార్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కమిషన్ పేర్కొందని అధికారుల కమిటీ వెల్లడించింది.



Read More
Next Story