
"భాయ్.. బచ్చా ఆ గయా భాయ్"
గచ్చిబౌలిలో పట్టుబడ్డ హెరాయిన్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు, ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో హెరాయిన్ ను పట్టుకున్నారు. నిందితుల నుంచి 66 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఎండీ నూర్ అఖ్తర్ (28),అజాత్ మెమిన్ (32)గా గుర్తించారు. బెంగాల్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి జంటనగరాల్లో సప్లై చేస్తుంటారు. నిందితులను అదుపులోకి తీసుకుని శేరిలింగంపల్లి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. హెరాయిన్ విక్రయించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) గురువారం గచ్చిబౌలిలో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో నిందితులను అరెస్టు చేసింది.
నిందితులు హెరాయిన్ రవాణా చేస్తారని, నిఘా వర్గాలు వెల్లడించాయి. మాదకద్రవ్యం వచ్చే సమయంలో "భాయ్.. బచ్చా ఆ గయా భాయ్" వంటి కోడ్ వాట్సాప్ సందేశాలను డ్రగ్ విక్రేతలు పెడుతున్నారు.ఈ మెసేజ్ లు అందుకున్న డ్రగ్ కొనుగోలు దారులు ఆ నెంబర్‌ను కాంటాక్ట్ అవుతున్నారు.కేవలం కోడ్ భాషతోనే క్రయవిక్రయాలు జరుగుతున్నాయని అధికారులు చాలారోజులక్రితమే గుర్తించారు. ఇటీవలె పట్టుబడుతున్న డ్రగ్ పెడరల్స్ ఇలాంటి మెసేజ్ లు పెట్టి కమ్యూనికేషన్ పెట్టుకుంటున్నట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు.ప్రధాన డ్రగ్ పెడ్లర్‌ను పట్టుకోవడానికి ఈగల్ టీం యత్నిస్తోంది. వాళ్లు కూడా బెంగాల్ లో ఉండి, ఆపరేషన్ సమయంలో పట్టుబడకుండా తప్పించుకోగలుగుతున్నారని, అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక బృందాలు ప్రస్తుతం వినియోగదారుల మొబైల్ ఫోన్‌ల నుండి స్వాధీనం చేసుకున్న వాట్సాప్ సందేశాలు ఇతర డిజిటల్ మార్గాలను విశ్లేషిస్తూ సరఫరా నెట్‌వర్క్‌ను శోధించే పనిలో ఈగల్ టీం ఉంది.
" వినియోగదారులు EAGLE ద్వారా పట్టుబడటం కంటే వ్యసనం నుండి బయటపడటం మంచిది" అని అధికారులు హెచ్చరించారు. గచ్చిబౌలిలోని కీలకమైన హెరాయిన్ పంపిణీ కేంద్రాన్ని ఈ ఆపరేషన్ విజయవంతంగా అరికట్ట కలిగించిందని EAGLE బృందం తెలిపింది.
తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో స్థానంలో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త సంస్థ మాదకద్రవ్యాల యాక్టివిటీస్ పై నిఘా పెడుతోంది.
“మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఒక గంజాయి మొక్కను పెంచినా లేదా రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలను తీసుకువచ్చినా, EAGLE టీం ఇట్టే పసిగడుతుంది. జాగ్రత్తగా ఉండండి” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు.
తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. ఇటీవలికాలంలో ఈగల్ టీం దాడులు సత్పలితాలను ఇస్తున్నాయి.