గల్ఫ్ మృతుల కుటుంబాలకు  రూ.10 కోట్ల ఎక్స్ గ్రేషియా
x

గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.10 కోట్ల ఎక్స్ గ్రేషియా

తెలంగాణలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియాను చెల్లించారు. హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారు.బాధిత కుటుంబాలకు నిధులు విడుదల చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించారు. ఎక్స్ గ్రేషియా చెల్లింపు మార్గదర్శకాల జీవో ప్రతులను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలు డా.బిఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావ్ లకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అధికారి ఇ.చిట్టిబాబు పాల్గొన్నారు.గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు ప్రభుత్వం రూ.10 కోట్ల 60 లక్షలు కేటాయించిందని, జిల్లాల కలెక్టర్ల ద్వారా చెల్లింపులు చేస్తామని మంత్రి తెలిపారు.


ఈ సందర్బంగా టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని గల్ఫ్ సంక్షేమ జీవోల విడుదలకు కృషి చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు ఏ రాష్ట్రంలో లేదని, ఇది దేశ చరిత్రలోనే ప్రథమం అని డా.వినోద్ పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకోండి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్ 7 తర్వాత మృతి చెందిన గల్ఫ్ కార్మికుల వారసులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం దరఖాస్తు చేరుకోవాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కోరారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవడానికి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి గల్ఫ్ సంఘాలు, గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ జేఏసీ పక్షాన భీంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.టీపీసీసీ ఎన్నారై సెల్ బృందం సాధారణ పరిపాలన శాఖ (జిఏడి - ఎన్నారై) ప్రభుత్వ కార్యదర్శి యం. రఘునందన్ రావు, జిఏడీ ఎన్నారై ప్రోటోకాల్ విభాగం జాయింట్ సెక్రెటరీ డా.ఎస్.హరీష్, ఎన్నారై అధికారులు బిబిఆర్ కార్తీక్, ఇ.చిట్టిబాబు, రూప లను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


Read More
Next Story