కల్తీ కల్లు ఘటనలో చనిపోయిన వారికి 10 లక్షలు ఇవ్వాలి
x

కల్తీ కల్లు ఘటనలో చనిపోయిన వారికి 10 లక్షలు ఇవ్వాలి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు డిమాండ్


హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు డిమాండ్ చేశారు. కల్తీ కల్లు తాగి చనిపోయిన వారి సంఖ్య అస్పష్టంగా ఉందని అనధికారికంగా మరో ఆరుగురు చనిపోయినట్టు ఆయన చెప్పారు. కల్లులో సైకో ట్రాపిక్ అవశేషాలు కలుపుతున్నట్టు స్పష్టమైందన్నారు.

కల్తీ కల్లును అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ కల్తీ కల్లును ప్రోత్సహిస్తుందన్నారు. కల్లు కాంపౌండ్ యజమానులతో కుమ్మెక్కైందని ఆయన ఆరోపించారు. ప్రతీరోజు కల్లు కంపౌండ్లను అధికారులు చెక్ చేయాలన్నారు. కల్తీ కల్లు తాగి కిడ్నీలు పాడవుతున్నాయని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనలో ఎక్సైజ్ శాఖాధికారులు వివిధ కాంపౌండ్లలో దాడులు చేసి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపితే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అల్ఫ్రజోలం అనే మత్తు మందు కల్లులో కలిపినట్టు వెల్లడైంది

Read More
Next Story