
పది పరీక్షలకు పాత పద్దతే..
2025-26 విద్యా సంవత్సరం నుంచి 80 శాతం ఎక్స్‌టర్నల్
టెన్త్ పరీక్షల నిర్వహణ విధానంపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను పాత పద్దతిలోనే నిర్వహిస్తామని వెల్లడించింది. 20శాతం ఇంటర్నల్ మార్కుల విధానం కొనసాగించనున్నట్లు ప్రకటించింది. పదో తరగతి పరీక్షల్లో 80 శాతం ఎక్స్‌టర్నల్, 20 శాతం ఇంటర్నల్ మార్కులకు కేటాయించున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. దీంతో పో తరగతి విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తమ పరీక్షల విధానంలో ఒక స్పష్టత రావడంతో దానికి తగ్గట్లుగా ప్లాన్స్ చేసుకుంటున్నారు.
అయితే పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై అటు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ఈ విషయంపై ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులను తొలగిస్తూ 2024 నవంబర్‌లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ అంశంపై అనేకే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఈ అంశం మరోసారి చర్చకు దారితీసింది. ఈ కారణంలో పరీక్ష విధానం విషయంలో పునరాలోచనలో పడిన విద్యాశాఖ అధికారులు.. పాత విధానాన్నే కొనసాగించాలని డిసైడ్ అయ్యారు.