
విషాహారం తిని 11 మంది విద్యార్థులు అస్వస్థత
సంగారెడ్డి జిల్లా మోడల్ స్కూల్లో చికెన్ తిని అనారోగ్యం.. ఇద్దరి పరిస్థితి విషమం
సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మాంసాహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. మోర్గి గ్రామంలోని మోడల్ పాఠశాలలో ఆదివారం రాత్రి 60 మంది విద్యార్థినులు చికెన్ తిన్నారు.. వీరిలో 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
తెలంగాణలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో విష ఆహారం తిని విద్యార్థులు తరచూ అనారోగ్యపాలవుతున్నారు. మంచిర్యాల, భద్రాచలం, నాగర్ కర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో విషాహరం తిని ఆస్పత్రుల పాలయ్యారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ లో ప్రభుత్వ పాఠశాలలు.. ముఖ్యంగా గిరిజన, గురుకుల పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నామమాత్రపు చర్యలు తీసుకుంటుంది తప్ప, శాశ్వత పరిష్కారం చూపడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు.
Next Story