కర్రెగుట్టలో దూసుకుపోతున్న భద్రతా బలగాలు
x

కర్రెగుట్టలో దూసుకుపోతున్న భద్రతా బలగాలు

సీఆర్‌పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ ఈ ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు.


కర్రెగుట్టలో భద్రతా బలగాలు చేస్తున్న ఆపరేషన్ శరవేగంగా ముందుకు కొనసాగుతోంది. ఒకవైపు శాంతి చర్చలు చేయాలంటూ మావోలను కోరుతున్నారు. సీఎం రేవంత్, మంత్రి సీతక్క, ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా మావోలతో శాంతి చర్చలు జరపాలని అంటున్నారు. కానీ కేంద్రం మాత్రం ఇవేవీ తనకు పట్టవన్నట్లు మావోలను మట్టుబెట్టే పనిలో నిమగ్నమయింది. ఇందులో భాగంగానే బుధవారం తెల్లవారుజామున కర్రెగుట్ట అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 22 మంది మావోలు మరణించారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థఆలను స్వాధీనం చేసుకున్నాయి. సీఆర్‌పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ ఈ ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూబింగ్ చర్యలను కొనసాగిస్తున్నారు. మావోయిస్టుల కోసం గత 20 రోజులుగా కర్రెగుట్టల ప్రాంతంలో విస్తృతంగా గాలిస్తున్న భద్రతా బలగాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఐదు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి 10 వేల మందికి పైగా జవాన్లు అడవులను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో భద్రతా బలగాలు సాగుతున్నాయి.

Read More
Next Story