హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు రూ.24,269 కోట్లు, జీఓ జారీ
x

హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు రూ.24,269 కోట్లు, జీఓ జారీ

హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు పరిపాలనా అనుమతులు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.దీని కోసం రూ.24,269 కోట్లు మంజూరు చేశారు.


హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీతోపాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా మెట్రోరైలు రెండో దశకు తెలంగాణ సర్కారు పచ్చజెండా ఊపింది.

- నగరంలో ఇప్పటికే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడ్‌లో అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్ 69 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సాంకేతికతతో నిర్మించిన మెట్రోరైలులో రోజుకు 5లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మొదటి దశ మెట్రోరైలు పనితీరును సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

9 మెట్రో కారిడార్లు
కారిడార్ 4 నాగోల్ -శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కారిడార్ 36.8 కిలోమీటర్లు,కారిడార్ 5 రాయదుర్గ్ - కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్లు,కారిడార్ 6 ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట (ఓల్డ్ సిటీ కారిడార్)7.5 కిలోమీటర్లు,కారిడార్ 7 మియాపూర్ -పటాన్ చెరు 13.4 కిలోమీటర్లు,కారిడార్ 8 ఎల్ బీ నగర్ -హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల మెట్రోరైలు నిర్మించనున్నారు. మెట్రోరైలు కారిడార్ 9 కింద ఎయిర్ పోర్టు నుంచి స్కిల్ యూనివర్శిటీ వరకు 40 కిలోమీటర్ల దూరం నిర్మించాలని ప్రతిపాదించారు.

తెలంగాణ వాటా రూ.7,313 కోట్లు
రూ.24,269 కోట్ల అంచనా వ్యయంలో సగం రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కింద చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.7,313 కోట్లు,కేంద్రం వాటాగా రూ.4,230 కోట్లు కేటాయించనున్నారు. ఈ మేర జీవో 196 నంబరు పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.


Read More
Next Story