
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. 28 మంది మావోలు హతం
బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ ప్రాంతాల డీఆర్జీ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి.
మావోయిస్ట్‌లను మట్టుబెట్టడమే ధ్యేయంగా చేపట్టిన ‘కగార్’ ఆపరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం నారాయణపూర్ జిల్లో భద్రతా బలగాలు, మావోల మధయ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్ట్‌లు హతమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్ట్‌లు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. అనుమానిత ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ ప్రాంతాల డీఆర్జీ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. భద్రతా బలగాలను గుర్తించిన వెంటనే మావోలు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అలెర్ట్ అయిన భద్రతా బలగాలు ఎదురుదాడులు చేశాయి.
Next Story