తెలంగాణలో 443 జాతుల పక్షులు,‘బర్డ్స్ ఆఫ్ తెలంగాణ’ పాకెట్ గైడ్
తెలంగాణలోని వివిధ పక్షులు..వాటి కిలకిల రావాలతో పక్షిప్రేమికులు మైమరచి పోతుంటారు.హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ‘బర్డ్స్ ఆఫ్ తెలంగాణ’ పాకెట్ గైడ్‌ను ముద్రించింది.
తెలంగాణ పక్షుల పాకెట్ గైడ్ ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఆవిష్కరించారు. తెలంగాణ లోని పక్షుల గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు ముద్రించిన బర్డ్స్ ఆఫ్ తెలంగాణ పాకెట్ గైడ్ ఉపయోగపడుతుందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.ప్రజా భవన్ లో బర్డ్స్ ఆఫ్ తెలంగాణ పాకెట్ గైడ్ ను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ పుస్తకం అవసరాన్ని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ కోర్ కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు బర్డ్స్ ఆఫ్ తెలంగాణ పాకెట్ గైడ్ ను రూపొందించడానికి చేసిన కృషిని ఉపముఖ్యమంత్రి అభినందించారు.
తెలంగాణ పక్షుల పాకెట్ గైడ్ అవసరం
తెలంగాణ పక్షుల గురించిన మొదటి పాకెట్ గైడ్ ప్రాముఖ్యత,ఆవశ్యకతను హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ప్రెసిడెంట్ ఆడెపు హరికృష్ణ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పుస్తకం తెలంగాణ పక్షులు తినే ఆహారం, వలసపక్షులు,వాటి పరిరక్షణ స్థితి గురించి తెలుసుకోవటానికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని హరికృష్ణ చెప్పారు.ఈ పుస్తకం విద్యార్థులు, ప్రకృతి ఔత్సాహికులు, పక్షి ప్రేమికులను ప్రత్యేక జీవ వైవిధ్యంతో కూడుకున్న తెలంగాణ ప్రకృతితో మమేకం కావటానికి ప్రోత్సహిస్తుంది.252 ముఖ్యమైన పక్షి జాతులున్న ఈ పాకెట్ గైడ్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా అందించనున్నట్లు హరికృష్ణ తెలిపారు.
పక్షిప్రేమికుల బర్డ్ వాక్
నగరంలోని సరస్సుల పరిరక్షణ, పక్షుల పరిశీలనను ప్రోత్సహించడానికి మాజీ డీజీపీ తేజ్ దీప్ కౌర్ మీనన్ ముందుకు వచ్చారు.హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ 490 ఉచిత బర్డ్ వాక్ ల ద్వారా పర్యావరణ పరిరక్షణపై పౌరులు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి చేసిన కృషిని తేజ్ దీప్ కౌర్ ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని రూపొందించడానికి తమ చిత్రాలను అందించిన 30మంది హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ల సహకరించారు. ఈ సందర్బంగా యువతలో పక్షుల పరిశీలనను ప్రోత్సహించటానికి, వాటిని సంరక్షించటానికి ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 443 పక్షుల్లో 252 పక్షులతో కూడిన ‘బర్డ్స్ ఆఫ్ తెలంగాణ’ పాకెట్ గైడ్ విడుదలైంది.
వరంగల్ సరస్సులో అరుదైన పక్షులు
తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని ఒక సరస్సు వద్ద అరుదైన రెండు ఆఫ్రికన్ ల్యాప్‌వింగ్‌లు దర్శనమిచ్చాయి. వలసలు తెలియని పక్షి జాతి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని ఒక సరస్సు వద్ద ఉంటున్నాయి.ఆఫ్రికాకు చెందిన ఆఫ్రికన్ పక్షుల ఉనికి భారతదేశంలో మొదటిసారి కనిపించిందని ఈ బర్డ్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీరామ్ రెడ్డి తెలిపారు.జనవరిలో తొలిసారిగా ఒక పక్షి కనిపించగా, ఏప్రిల్-మేలో రెండో పక్షి కూడా కనిపించిందని ఆయన చెప్పారు.
Next Story