మిడ్ మానేరు నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్లు
x

మిడ్ మానేరు నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్లు

మిడ్ మానేరు రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు తెలంగాణ సర్కారు శుభవార్త వెల్లడించింది. 4696 మంది మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది.


మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం కింద 10,683 మంది ఇళ్లు కోల్పోయి నిర్వాసితులుగా మారారు. ఆర్ ఆర్ ప్యాకేజీ కింద వీరిలో 5,987 మంది నిర్వాసితులకు 12 గ్రామాల్లో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చింది.

- మిగిలిన 4,696 మంది నిర్వాసితులకు ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి ప్రతిపాదనలు పంపించారు.దీంతో తెలంగాణ గృహనిర్మాణ శాఖ మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ రోడ్లు భవనాల శాఖ సెక్రటరీ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ జీఓఎంఎస్ నంబరు 42 పేరిట ఉత్తర్వులు జారీ చేశారు.
- 12 గ్రామాల్లోని నిర్వాసితులకు ఇళ్లను మంజూరు చేశారు. ఒక్కో ఇల్లు నిర్మాణం కోసం రూ.5లక్షలను ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కేటాయించారు.


Read More
Next Story