
సూర్యపేట జిల్లాలో బయటపడ్డ 800 ఏళ్ల నాటి రాగిఫలకాలు
కబరస్తాన్ లో బయటపడ్డ సంపద
సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో 800 ఏళ్ల నాటి రాగిఫలకాలు బయటపడ్డాయి. అతి పురాతన ముస్లిం స్మశాన వాటికలో అరుదైన సంపద బయటపడిందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేశారు. చాళుక్యుల నాటి భీమ1కి చెందినవిగా అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 29న స్మశాన వాటికలో గుంతలు తవ్వుతుండగా మట్టి కుండ ఒకటి బయటపడింది. దాన్ని తెరచి చూస్తే ఎనిమిది సెట్ల రాగిఫలకాలు కనిపించాయి. రెవిన్యూ అధికారులు వాటిని స్వాధీనపర్చుకుని హైద్రాబాద్ పురావస్తు కార్యాలయానికి పంపించారు. రాగిఫలకాలను రసాయనాలతో శుద్ది చేస్తే 800 ఏళ్ల నాటి చాళుక్య బీమ 1 (క్రీస్తు పూర్వం 888 నుంచి 918) నాటికాలంవిగా అధికారులు గుర్తించారు.
Next Story