బాలుడి కాళ్లు విరగొట్టిన మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్..
x

బాలుడి కాళ్లు విరగొట్టిన మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్..

మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్‌లోని పైలట్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలుడు రెండు కాళ్లు విరిగాయి.


మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్‌లోని పైలట్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలుడు రెండు కాళ్లు విరిగాయి. తెలంగాణ శాశసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్‌లోని పైలట్ ఒక్కసారిగా అదుపుతప్పి ముగ్గురు వ్యక్తుల ఢీకొట్టింది. వారిలో బాలుడు కూడా ఉన్నాడు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా బాలుడి సహా మిగిలిన ఇద్దరికి కూడా కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. కాగా బాధితులను మెరుగైన చికిత్స అందించాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారని, వారి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ ఘటనపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సదరు మంత్రిపై కీలక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యత ఉండాలి కాదా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. మరికొందరు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని, ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకుని బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

పట్టించుకోని మంత్రి..!

కాగా మంత్రి కాన్వాయ్ అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా అతి వేగంగా వచ్చి మనుషులను ఢీకొట్టిందే కాకుండా ఆగి కనీసం పరామర్శించకుండా మంత్రి వెళ్లిపోయారని ప్రజలు చెప్తున్నారు. బాధ్యతల గల పదవుల్లో ఉన్నప్పటికీ మంత్రి ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించారని, ఇప్పటి వరకు క్షతగాత్రుల గురించి ఆరా కూడా తీయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి అతి వేగానికి తమ పిల్లాడి భవిష్యత్తు దెబ్బతిన్నదని బాలుడి తరపు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగా జీవితం కూడా చూడని తమ పిల్లోడి రెండు కాళ్లు విరిగిపోయాయని, ఇందుకు మంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎదురుగా మనుషులు ఉన్నారో లేదో కూడా చూసుకోకుండా వెళ్లేటంత ఉపధ్రవం ఏమొచ్చిందని కూడా స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మంత్రి శ్రీధర్ బాబు తన తప్పు తెలుసుకుని బాధితులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More
Next Story