పాత బస్తీలో  ఓ ఇంట్లో అస్తి పంజరం
x

పాత బస్తీలో ఓ ఇంట్లో అస్తి పంజరం

క్రికెట్ బాల్ కోసం వెతుకుతుండగా...


పాత బస్తీ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో అస్తి పంజరం కలకలం రేపింది. ఏడేళ్లుగా ఆ ఇంటి యజమాని విదేశాల్లో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న యువకులు క్రికెట్ ఆడుతుండగా బాల్ ఆ ఇంట్లో పడింది. బాల్ కోసం వెతుకుతుండగా ఓ గదిలో అస్తి పంజరం కనిపించింది. ఆ ఇంటి యజమాని విదేశాలనుంచి తిరిగొచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అస్తి పంజరం ఆ వ్యక్తిదే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని హత్యకు గురయ్యాడా, వేరే వ్యక్తి హత్యకు గురయ్యాడా అనేది తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న డిసీపీ ఘటనాస్థలికి చేరుకున్నారు.

బాల్ కోసం వెళ్లిన యువకులు ఆ ఇంట్లో ఉన్న అస్థి పంజరం వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో పోలీసులకు సమాచారమందింది. వీడియో తీసిన యువకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Read More
Next Story