నెహ్రూ జూపార్కులో ప్రత్యేక ఆకర్షణ..పులిని పోలిన ఆఫ్రికా పిల్లులు
x
ఆఫ్రికన్ సర్వల్ క్యాట్

నెహ్రూ జూపార్కులో ప్రత్యేక ఆకర్షణ..పులిని పోలిన ఆఫ్రికా పిల్లులు

హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలో పులిలా విభిన్న చారలతో కూడిన ఆఫ్రికా పిల్లులు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.


హైదరాబాద్ నెహ్రూ జూలాజిల్ పార్కులో అరదైన ఆఫ్రికన్ సర్వల్ క్యాట్ లు ఎన్ క్లోజరులో విడుదల చేశారు. దీంతో జూపార్కులో వివిధ జాతుల జంతువుల సంఖ్య 15కు చేరింది. ఈ సర్వల్ పిల్లులు జూ లోని ఎన్ క్లోజర్లలో 16 ఏళ్ల పాటు జీవిస్తాయని జూపార్కుల డైరెక్టరు సునీల్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఆఫ్రికా ఖండానికి చెందిన ఈ సర్వల్ పిల్లులు చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.




సందర్శకులను అలరిస్తున్న ఆఫ్రికన్ పిల్లులు

చిన్న పిల్లుల ఎన్‌క్లోజర్‌లో ఆడుకుంటూ జూ సందర్శకులను అలరిస్తున్నాయి. ఈ పిల్లుల వయసు రెండేళ్లని జూ అధికారులు చెప్పారు. ఈ పిల్లులను తెలంగాణ పీసీసీఎఫ్ డాక్టర్ సి సువర్ణ జెండా ఊపి ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. శిలాజ ఉద్యానవనంలో తెలంగాణ మ్యాప్ నమూనాలో వివిధ రకాల మొక్కలు నాటారు.



జూపార్కులో జంతువుల సంతానోత్పత్తి

జూపార్కులో కొత్త జాతి జంతువులైన సర్వల్ పిల్లులను ప్రవేశపెట్టడమే కాకుండా వివిధ వన్యాప్రాణుల సంతానోత్పత్తి కార్యక్రమానని చేపట్టామని జూ అధికారులు చెప్పార. ఎన్ క్లోజర్లలోనే వివిధ జంతువులు సంతానోత్పత్తి చేస్తున్నాయని జూ పార్కు అధికారులు తెలిపారు. 1987 వ సంవత్సం నుంచి ఉన్న శిలాజ ఉద్యనవనాన్ని ఆధునీకరించినట్లు అధికారులు వివరించారు


Read More
Next Story