బ్రిటన్ లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం
x
తెలంగాణ వాసికి ఖండాంతరాల్లో ఖ్యాతి

బ్రిటన్ లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం

యునైటెడ్ కింగ్ డమ్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ కు ఉదయ్ నాగరాజు


బ్రిటన్ లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా యునైటెడ్ కింగ్ డమ్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ కు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు నామినేట్ అయ్యారు. హౌజ్ ఆఫ్ లార్డ్స్ సభ్యులను ప్రధానమంత్రి సూచనమేరకు కింగ్ ఆఫ్ ఇంగ్లండ్ నామినేట్ చేస్తారు. ఇందుకు వివిధ రాజకీయపార్టీలు, స్వతంత్ర కమిటీ, ప్రజల నుంచి కూడా నామినేషన్లు వస్తాయి. ప్రధానంగా నైపుణ్యం, అనుభవం, దేశానికి చేసిన సేవల ఆధారంగా హౌజ్ ఆఫ్ లార్డ్స్ కు నామినేట్ చేస్తారు.


బ్రిటన్ ఆఫ్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ అనేది బ్రిటీషు పార్లమెంటు ఎగువ సభ. చట్టాలను రూపొందించడం, ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం ప్రధాన విధుల్లో హౌజ్ ఆఫ్ లార్డ్స్ కీలకం. గతంలో నాగరాజు బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల బరిలో నిల్చున్నారు. లేబర్ పార్టీ నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. శనిగరం గ్రామానికి చెందిన సామాన్యమధ్యతరగతి కుటుంబంలోనాగరాజు జన్మించారు. హన్మంత్ రావు, నిర్మలా దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం ఉన్న నాగరాజు అంచెలంచెలుగా ఎదిగారు. ఈ పదవికి భారత సంతతికి చెందిన వారిని నామినేట్ చేస్తారు. తెలంగాణ వాసికి ఈ పదవి రావడం పట్ల సిద్దిపేట జిల్లా వాసులు సంబురాలు జరుపుకుంటున్నారు.

వరంగల్, హైదరాబాద్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన నాగరాజు ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లారు. అక్కడ పీజీ పూర్తి చేశారు.అక్కడ ప్రఖ్యాత యూనివర్శిటీలో పాలనా శాస్త్రంలో పీజీ పట్టాపుచ్చుకున్నారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం భావితరాలపై ఉంటుందని ముందే ఊహించిన నాగరాజు ఎఐ పాలసీ ల్యాబ్స్ అనే థింక్ ట్యాంక్ ను నెలకొల్పారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆయనకు మంచి పట్టు ఉంది.

Read More
Next Story