రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఏసీబీ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతులు జారీ చేసింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఏసీబీ కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతులు జారీ చేసింది. జనవరి 13 నుంచి 23 వరకు సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించనున్నారు. అయితే ఓటుకు నోటు కేసులో రేవంత్ తన పాస్‌పోర్ట్‌ను కోర్టులో అప్పగించి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఏసీబీ కోర్టు నుంచి అనుమతి కోరారు రేవంత్. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని రేవంత్ కోర్టుకు తెలియజేశారు. కాగా అందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. జూలై 6లోగా పాస్‌పోర్ట్‌ను తిరిగి అప్పగించాలని ఆదేశించింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు రెడీ అవుతోంది. జనవరి 21 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్ దావోస్‌లో పర్యటించనున్నారు. దావోస్‌లో జనవరి 20 నుంచి 25 వరకు ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ 55వ వార్షిక సదస్సు జరగనుంది. ఈ ఫారమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఆయనతో పాటు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు మూడు రోజుల పాటు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 13 లేదా 15 తేదీల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆస్త్రేలియాకు జనవరి 13న వెళ్లాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సంక్రాంతి పండగ తర్వాత జనవరి 15న రేవంత్.. ఆస్ట్రేలియాకు బయలదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో క్వీన్స్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు రేవంత్. ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన అనంతరం 19వ తేదీన సింగపూర్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ రెండు రోజుల పాటు పర్యటించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా దావోస్ వెళ్లనున్నారు.