
ఈ-కార్ రేస్ కేసు.. FEO సీఈవో విచారణ
ఫార్ములా ఈ-కార్ రేసు సీజన్ 9 చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ వంటి అంశాలపై అధికారులకు కీలకంగా ప్రశ్నించారు
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు కీలక మలుపులు తీసుకుంటుంది. ఈకేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని దర్యాప్తు సంస్థలు ఈడీ, ఏసీబీ ఇప్పటికే విచారించాయి. కాగా ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచింది. విదేశీ సంస్థ ఎఫ్ఈఓకు నోటీసులు జారీ చేసింది. విచారణకు వర్చువల్‌గా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆ ప్రకారమే సోమవారం.. ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ ఆల్బర్టోను వర్చువల్‌గా విచారించారు. ఇందులో పలు కీలక అంశాలపై అధికారులు ప్రశ్నించారు. ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఈ విచారణలో భాగంగా ఫార్ములా ఈ-కార్ రేసు సీజన్ 9 చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ వంటి అంశాలపై అధికారులకు కీలకంగా ప్రశ్నించారు.
Next Story