‘కేటీఆర్ ఒత్తిడితోనే కార్ రేస్ చెల్లింపులు’..
x

‘కేటీఆర్ ఒత్తిడితోనే కార్ రేస్ చెల్లింపులు’..

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ చుట్టు ఉచ్చు మరింత బిస్తోంది. ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.


ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ చుట్టు ఉచ్చు మరింత బిస్తోంది. ఇప్పటికే కేసు తీవ్ర చర్చలకు దారితీయగా.. తాజాగా ఇందులో ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కౌంటర్‌లో ఏసీబీ సంచలన విషయాలు బయటపెట్టింది. కేటీఆర్ ఒత్తిడి మేరకే అధికారులు రూ.54కోట్లు చెల్లించారని ఏసీబీ తన కౌంటర్‌లో తెలిపింది. అంతేకాకుండా ఈ కేసులో వివరాలను శనివారం ఈడీకి అందజేసింది ఏసీబీ. ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, హెచ్ఎండీఏ ఒప్పంద పత్రాలతో పాటు వారు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఈడీకి అందించింది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కూడా కేటీఆర్ పాల్పడ్డారంటూ ఏసీబీ తన కౌంటర్‌లో తెలిపింది.

ఆర్థిక శాఖ అనుమతి, క్యాబినెట్ నిర్ణయం లేకుండా చెల్లింపులు చేసే అధికారులపై కేటీఆర్ ఒత్తిది తెచ్చరాని, దాని ప్రకారమే అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు రూ.55 కోట్లు బదిలీ చేశారని ఏసీబీ వివరించింది. దీని వల్ల హెచ్ఎండీఏకు రూ.8 కోట్ల అదనపు భారం పడిందని తెలిపింది. అనుమతులు లేకుండా చెల్లింపులు చేసినందుకు గానూ ఆర్‌బీఐ.. హెచ్‌ఎండీఏకు రూ.8 కోట్ల జరిమానా విధించిందని తెలిపారు. ఇప్పుడు అసంబద్దమైన కారణాలు చూపుతూ కేసు కొట్టేయాలని కోరడం దర్యాప్తును అడ్డుకోవడమే అవుతుందని ఏసీబీ పేర్కొంది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏసీబీ తన కౌంటర్‌లో తెలిపింది. అధికారుల నుంచి అనుమతులు వచ్చిన తర్వాతనే కేటీఆర్‌పై కేసు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగాయని వివరించింది.

‘‘రాజకీయ కక్షతోనో, అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామని అనడం సరికాదు. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించారని, ఎఫ్ఈఓకు చెల్లింపులు చేయాలని కేటీఆర్ చెప్పాలని ఆయనే స్వయంగా చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యం కావడాన్ని కారణంగా చెప్తూ కేసు కొట్టేయాలని అడగడం సమంజసంకాదు. తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయొచ్చు. ఈమేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి’’ అని ఏసీబీ తెలిపింది.

Read More
Next Story