ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్
x

ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. మారువేషాల్లో వెళ్లి ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.


తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. మారువేషాల్లో వెళ్లి ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. లారీ డ్రైవర్లుగా వేషం మార్చుకుని లంచగొండులను పట్టుకునేందుకు చెక్పోస్ట్ల దగ్గర సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అశ్వరావుపేట చెక్ పోస్ట్ దగ్గర లంచాలు వసూలు చేస్తున్న ఆర్టీఏ చెక్ పోస్ట్ సిబ్బందిని పట్టుకున్నారు. విశేషమేమిటంటే మారు వేషంలో వచ్చింది ఏసీబీ అధికారులు అని తెలియక లారీ డ్రైవర్లే అనుకుని సదరు సిబ్బంది అధికారులను కూడా లంచం డిమాండ్ చేశారు. దీంతో అడ్డంగా బుక్కయ్యారు.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం తెలంగాణలోని రవాణాశాఖపై ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడ, నాగోల్, మలక్ పెట్, ఖైరతాబాద్, అత్తాపూర్ తో పాటు నల్గొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆర్టీఏ ఆఫీసుల్లో భారీగా అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు రావడంతోనే ఈ దాడులు నిర్వహిస్తోన్నట్టు తెలుస్తోంది. నకిలీ ఇన్స్యూరెన్సులు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.

కాగా, ఏసీబీ అధికారులు నేరుగా వాహనదారుల నుండి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఏజెంట్లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు, లావాదేవీలపై విచారిస్తున్నారు. మహబూబాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో ఆరుగురు ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి 45,100 నగదు, డ్రైవర్ నుంచి 16,500 నగదు, నూతన లైసెన్స్ లు, రెన్యువల్స్, ఫిట్నెస్ కి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యమైందని తెలుస్తోంది.

Read More
Next Story