హెచ్ ఎండిఎ అధికారి శివబాలకృష్ణ అవినీతి సంపాదన చూస్తే కళ్లు తిరుగుతాయ్
x
అవినీతి నిరోధక శాఖ అధికారులు లెక్కిస్తున్న నగదు

హెచ్ ఎండిఎ అధికారి శివబాలకృష్ణ అవినీతి సంపాదన చూస్తే కళ్లు తిరుగుతాయ్

84 లక్షల 60వేల నగదు.. 2 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి, 32 లక్షలు విలువచేసే 60 ఖరీదైన చేతి గడియారాలు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్‌, 90 ఎకరాల భూమి..


ఓ అధికారి తన జీవిత కాలంలో ఎంత సంపాయిస్తారు? నిజాయితీపరుడై, తన జీతానికే పరిమితమైతే 50 నుంచి కోటి రూపాయల వరకు సంపాయిస్తాడని ఓ అనధికార అంచనా. కానీ హైదరాబాద్‌లో హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ మాజీ డైరెక్టర్‌ వంద కోట్లు సంపాయించారని ఏసీబీ గుర్తించింది. ఏసీబీకి అందిన సమాచారం ఆధారంగా శివబాలకృష్ణ ఇంటిపైన 24 గంటలుగా సోదాలు నిర్వహించారు. కళ్లు చెదిరే వస్తువుల్ని, నగదు, నట్రా, బోలెడన్ని ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లు పట్టుకున్నారు. మొత్తం వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులున్నట్టు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్న ఆ అధికారి పేరు శివబాలకృష్ణ. 2018 నుంచి 2023 వరకు HMDAలో డైరెక్టర్‌గా పనిచేశారు శివబాలకృష్ణ. HMDA డైరెక్టర్‌గా , ప్లానింగ్‌ విభాగంలో కీలక స్థానంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. శివబాలకృష్ణ ఇంట్లోనే దాదాపు 20 మంది ఏసీబీ అధికారులతో సోదాలు చేశారు. ఇంట్లో అణువణువునా సోదాలు చేసిన ఏసీబీ.. బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించింది. అక్రమాస్తుల కేసులో HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను ఏసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

24 గంటలుగా సోదాలు...

శివబాలకృష్ణ ఇంట్లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం ఉదయం వరకు సుమారు 24 గంటలుగా జరిగిన ఏసీబీ సోదాలు ముగిశాయి. అక్రమాస్తుల చిట్టా కొలిక్కివచ్చింది. వంద కోట్ల రూపాయలకు పైగా ఆయనకు ఆస్తున్నట్టు తేల్చినా బయటి మార్కెట్లో వాటి విలువ అంతకుమించే ఉంటుందంటున్నారు. శివ బాలకృష్ణ.. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఆయన మెట్రోరైల్‌ ప్లానింగ్‌ అధికారిగా, రెరా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కేసు నమోదు చేశారు. ఇవాళ కోర్టుకు హాజరుపరిచిన తర్వాత ఏమవుతుందో చూడాలి. మణికొండలోని ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఇళ్లు సహా మొత్తం 17 ప్రాంతాల్లో 14 బృందాలు సోదాలు నిర్వహించారు. నిన్న తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో 14 బృందాలు.. బాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఇప్పటివరకు 100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు గుర్తించారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది. ఇవాళ బ్యాంకు లాకర్లు తెరిచే అవకాశముంది. అవి తెరిస్తే ఇంకెన్ని ఆస్తులు బయటపడతాయో చూడాలంటున్నారు ఏసీబీ అధికారులు.

అంత క్యాష్ ఇంట్లో ఎందుకు?

ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు 84 లక్షల 60వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల బంగారం, ఐదున్నర కిలోల వెండి, 32 లక్షలు విలువచేసే 60 ఖరీదైన చేతి గడియారాలు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్‌, 90 ఎకరాల భూమి గుర్తించారు ఏసీబీ అధికారులు. స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు,, 14 మొబైల్‌ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు గుర్తించారు. మొత్తం 100 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. బాలకృష్ణ నివాసంలో క్యాష్‌ కౌంటింగ్‌ యంత్రాలను చూసిన ఏసీబీ అధికారులే విస్తుపోయారు. ఇంట్లోనే నాలుగు లాకర్లు ఉన్నాయంటే రోజువారీ ఆదాయం ఎంత ఉండిఉండాలని అధికారులు ముక్కున వేలేసుకున్నారట. సోదాల అనంతరం శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ... ఇవాళ కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. అనంతరం కస్టడీకి కోరనున్నారు. కళ్లు చెదిరే బంగారం, డబ్బు, కాస్టీ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, .. ఇలా మొత్తం వంద కోట్లకు పైగా అక్రమ ఆస్తులను ఏసీబీ బయటకు తీసింది. ఫ్లాట్స్‌, బ్యాంక్‌ డిపాజిట్స్‌, బినామీలను వెలికితీసింది ఏసీబీ.

Read More
Next Story