‘3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ మా టార్గెట్’
x

‘3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ మా టార్గెట్’

10 ఏళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమిగా మార్చాలి.


తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగానే 3 ట్రిలియన్ గోల్ గురించి వివరించారు. 2047 నాటికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో పారదర్శకమైన పరిపాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నడిపించడానికి ప్రజలందరూ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ఆంకాక్షను వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్లకు చేరితే దేశ జీడీపీలో తెలంగాణ సహకారం 5 నుంచి 10 శాతానికి పెరుగుతుంది.

“దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగానే తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వచ్చే పదేళ్లలో 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం’’ అని తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ 16 నెలల పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. దేశంలో తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలబెట్టడం కోసం ఐఏఎస్, ఐపీఎల్, వ్యాపారవేత్తలు, ఇతర రంగాల వారు సహకరించాలని సీఎం రేవంత్ కోరారు.

‘‘ఇందులో భాగంగానే తెలంగాణ రైజింగ్-2047 యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశాం. రానున్న 10 ఏళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమిగా మార్చాలి. 2047 నాటికి 3 ట్రిలియన్ యూఎస్ డాలర్ ఎకానమీగా మార్చాలి. తెలంగాణను దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది’’ అని తెలిపారు. ‘‘తెలంగాణను పెట్టుబడులకు స్వర్గదామంగా ప్రమోట్ చేయడంలో ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అనేక సంస్థలతో రూ.3 లక్షల కోట్ల కన్నా అధిక మొత్తంలో ఒప్పందాలు చేసుకుంది. వీటిలో గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్రిజంట్, హెచ్‌సీఎల్ వంటి అనేక దిగ్గజ సంస్థలు ఉన్నాయి.

Read More
Next Story