ఇక్ఫాయ్ వర్సిటీలో యాసిడ్ అటాక్
x

ఇక్ఫాయ్ వర్సిటీలో యాసిడ్ అటాక్

హైదరాబాద్ పరిధిలోని శంకర్ పల్లిలో ఉన్న ఇక్ఫాయ్ (Institute of Chartered Financial Analysts of India) యూనివర్సిటీలో దారుణ ఘటన చేసుకుంది. విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది.


హైదరాబాద్ పరిధిలోని శంకర్ పల్లిలో ఉన్న ఇక్ఫాయ్ (Institute of Chartered Financial Analysts of ఇండియా) యూనివర్సిటీలో దారుణ ఘటన చేసుకుంది. విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో బీటెక్ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ అటాక్ జరగడంతో తీవ్ర గాయాలపాలైంది. యాజమాన్యం ఆమెని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... కాలేజీలో కొందరు విద్యార్థులు బకెట్ లో రంగునీళ్లు కలిపారు. ఈ నీళ్లలో ఎవరో యాసిడ్ కలిపారు. అది తెలియక రంగు నీళ్లు అనుకుని ఇతర విద్యార్థులు లేఖ్యపై జల్లారు. ఒక్కసారిగా యాసిడ్ నీళ్లు పడటంతో లేఖ్య మంటలు భరించలేక కేకలు పెట్టింది. దీంతో విద్యార్థులు యాజమాన్యానికి విషయం తెలిపారు. తీవ్రంగా గాయపడిన లేఖ్యని యాజమాన్యం హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లేఖ్య నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అసలు నీళ్లలో యాసిడ్ ఎవరు కలిపారు, దీని వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు అని ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనతో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడికి నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని, విద్యార్థినికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు.

Read More
Next Story