నవీన్ యాదవ్‌కు ప్రముఖ నటుడి సపోర్ట్..
x

నవీన్ యాదవ్‌కు ప్రముఖ నటుడి సపోర్ట్..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో నవీన్‌ను గెలిపించాలని కోరిన నటుడు సుమన్.


జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ తరుపు నవీన్ యాదవ్ నిలబడనున్నారు. నవీన్‌కు టికెట్ కన్ఫార్మ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అతనికి ప్రముఖ సినీ నటుడు సుమన్ తన మద్దతు ప్రకటించారు. నవీన్‌కు అంతా మద్దలు ఇవ్వాలని, అతనిని భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా నవీన్‌కు టికెట్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ చాలా మంచి వాడు. యువకుడే అయినా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. అతనిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి’’ అని ఓ వీడియోను విడుదల చేశారు సుమన్.

Read More
Next Story